రైల్లో మహిళపై రే*ప్ కేసు... విచారణలో తెరపైకి సంచలన విషయాలు!
అవును... సుమారు ఐదు రోజుల క్రితం సత్రాంగచ్చి-చర్లపల్లి ప్రత్యేక రైలులో మహిళపై అత్యాచారం కేసుకు సంబంధించి నిందితుడిని గుంటూరు రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 19 Oct 2025 10:54 AM ISTఇటీవల సంత్రగచ్చి-చర్లపల్లి స్పెషల్ ట్రైన్ లో బోగీలో ఉన్న మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం.. ఈ ఘటనకు సంబంధించి సికింద్రాబాద్ లో పోలీసులు కేసు నమోదు చేయడం.. సీసీ కెమెరాల ఆధారంగా గుంటూరు రైల్వే పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేయడం తెలిసిందే. అనంతరం జరిగిన విచారణలో నిందితుడి నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
అవును... సుమారు ఐదు రోజుల క్రితం సత్రాంగచ్చి-చర్లపల్లి ప్రత్యేక రైలులో మహిళపై అత్యాచారం కేసుకు సంబంధించి నిందితుడిని గుంటూరు రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పోలీసు దర్యాప్తులో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి పనికి పూనుకోవడం నిందితుడికి ఇదే మొదటి సారి కాదని తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అత్యాచారం అనంతరం నిందితుడు రాజారావు పెదకూరపాడు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నెమ్మదిగా వెళ్తుండడంతో అక్కడ దిగిపోయాడు. అక్కడ నుంచి పత్తి చేల మీదుగా నడుచుకుంటూ వెళ్లి సత్తెనపల్లి చేరుకుని, అక్కడ బస్సెక్కాడు. ఈ క్రమంలో బాధితురాలి నుంచి లాక్కొన్న సెల్ ఫోన్ ను విక్రయించి వచ్చిన డబ్బుతో బిర్యానీ తిన్నాడు.
అనంతరం అక్కడే రైలెక్కి గుంటూరు వచ్చి నగర వీధుల్లో రెండుగంటలపాటు చక్కర్లు కొట్టాడు. తరువాత మరో రైలు ఎక్కి తెనాలిలో దిగాడు. ఈ సమయంలో... బాధితురాలి సెల్ ఫోన్ లోని సిమ్ కార్డును తన ఫోన్ లో వేసుకుని వాడడంతో పోలీసుల పని సులువైందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... టవర్ లొకేషన్ ద్వారా పోలీసులు అతన్ని గుర్తించి పట్టుకున్నారు.
ఈ క్రమంలో జరిగిన గత మూడు రోజుల విచారణలో నిందితుడు అనేక అంశాలు వెల్లడించినట్టు తెలిసింది. ఇందులో భాగంగా... అతడు ఇలాంటి పనికి పూనుకోవడం ఇదే తొలిసారి కాదట. సుమారు ఎనిమిది నెలల క్రితం కేరళకు చెందిన ఓ మహిళపైనా ఇలా అఘాయిత్యానికి పాల్పడినట్టు అంగీకరించాడని అంటున్నారు. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగింది?:
ఏపీకి చెందిన ఓ మహిళ(35) సోమవారం రాజమండ్రి రైల్వే స్టేషన్ లో సంత్రగాచి స్పెషల్ రైలులోని మహిళా బోగీలో ఎక్కారు. తెలంగాణలోని చర్లపల్లి స్టేషన్ లో దిగిన అనంతరం ఎక్కడైనా ఇళ్లలో పని చూసుకోవాలని ఆమె అనుకున్నారు. ఈ క్రమంలో.. రైలు గుంటూరు స్టేషన్ కు చేరుకున్న సమయంలో బోగీలో ఉన్న మిగిలిన ప్రయాణికులు దిగిపోగా ఆమె ఒక్కరే మిగిలారు.
అదే సమయంలో సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి ఆ బోగీలోకి ఎక్కాడు. ఇది మహిళా బోగీ అని ఆమె వారిస్తున్నా, రిక్వస్ట్ చేసి లోపలికొచ్చాడు. ఈ క్రమంలో.. కొద్దిసేపటి తర్వాత తలుపు మూసివేశాడు. రైలు గుంటూరు స్టేషన్ నుంచి బయలుదేరిన 20 నిమిషాల తరువాత కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న రూ.5,600, సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగును లాక్కొన్నాడు.
అనంతరం.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో... రైలు పెదకూరపాడు స్టేషన్ కు చేరుకుంటుండగా కిందకి దిగి పారిపోయాడు. రైలు చర్లపల్లి స్టేషన్ కు చేరుకున్న అనంతరం బాధితురాలు సికింద్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నడికుడి పోలీసులకు బదిలీ చేశారు.
