సంచార్ సౌథీకి మించిన మరో రచ్చకు మోడీ సర్కారు?
ఒక రచ్చ కొలిక్కి రాక ముందే మరో రచ్చకు తెర తీసే పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
By: Tupaki Desk | 6 Dec 2025 11:00 AM ISTఒక రచ్చ కొలిక్కి రాక ముందే మరో రచ్చకు తెర తీసే పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొన్నటికి మొన్న సంచార్ సౌథీ యాప్ ను ప్రతి ఫోన్ లోనూ ఉండేలా ఫోన్ల తయారీ కంపెనీలతో మాట్లాడి.. ప్రతి ఫోన్ లో ఈ యాప్ తప్పక ఉండేలా ప్లాన్ చేస్తున్న వైనం వెలుగు చూడటం.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ రచ్చగా మారటంతో కేంద్రంలోని మోడీ సర్కారు కాస్త వెనక్కి తగ్గింది. ఫోన్లో ఉంటే సంచార్ సౌథీతో ఉపయోగమని..దాని కారణంగా సైబర్ సెక్యూరిటీ గణనీయంగా పెరుగుతుందన్న మాట బాగానే ఉన్నా.. వ్యక్తిగత గోపత్యను దెబ్బేస్తుందన్న మాటకు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేక స్పందనతో తన ఆలోచనను మార్చుకోవటమే కాదు.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించటం తెలిసిందే.
ఈ రచ్చ ఒక కొలిక్కి వచ్చిందో లేదో.. ఇప్పుడు మరో అంశం తెర మీదకు వచ్చింది. అదే శాటిలైట్ ఆధారిత లొకేషన్ ట్రాకింగ్ విధానం. ఇందులో నిరంతరం సెల్ ఫోన్ ను యాక్టివేట్ చేసి ఉండటం తప్పనిసరిగా చెబుతున్నారు. దీనికి సంబంధించి కేంద్రం ఇదే విధానాన్ని అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మరో అప్డేట్ ఏమంటే.. టెలికాం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఫోన్ తయారీ సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే.. ఈ నిర్ణయంపై యాపిల్.. గూగుల్.. శామ్ సంగ్ లు సుముఖంగా లేవని చెబుతున్నారు. ఈ విధానంలో యూజర్ల ప్రైవసీ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు అవుతుందని సదరు కంపెనీలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ అంశంపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని చెబుతున్నారు. అయితే.. కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
పలు కేసుల లెక్క తేల్చేందుకు వీలుగా కమాండ్ కంట్రోల్ సంస్థ.. సీసీ కెమేరాలతో లొకేషన్ ను కచ్ఛితంగా దొరకని పరిస్థితి. అదే.. అసిస్టెడ్ జీపీఎస్ సిస్టమ్ సాయంతో కేవలం మీటరు వ్యత్యాసంతో వ్యక్తి ఉన్న కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించే వీలుంది. చట్టపరమైన దర్యాప్తుల్లో లొకేషన్ ల్రాకింగ్ చేసే విధానం ప్రపంచంలో మరెక్కడా లేదని యాపిల్.. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తే కొన్ని వర్గాల వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే.. ఫోన్ ను నిరంతరం నిఘా పరికరాలు కన్నేయటం మంచిది కాదంటున్నారు. కీలక స్థానాలు.. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారిని ఇట్టే పసిగట్టేయొచ్చు. ఏమైనా మొన్నటి సంచార్ సౌథీ యాప్ ను పక్కన పెట్టేసి నాలుగైదు రోజులు కాకముందే మరోసారి బయటకువెళుతున్నారు. ఏమైనా ఒక వివాదం వెనుకనే మరో వివాదం తెర మీదకు తీసుకురావటం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
