Begin typing your search above and press return to search.

శశికళ కొత్త పార్టీ...ముగ్గురు ముఖ్యమంత్రుల మద్దతుతో

తమిళనాడు రాజకీయాలు కీలకమైన మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటిదాకా త్రిముఖ పోటీ సాగుతుందని అంతా భావించారు. కానీ సడెన్ గా మాజీ సీఎం జయలలిత సహచరి నేస్తం అయిన శశికళ ఎంట్రీ ఇచ్చారు.

By:  Satya P   |   25 Feb 2026 5:18 AM IST
శశికళ కొత్త పార్టీ...ముగ్గురు ముఖ్యమంత్రుల మద్దతుతో
X

తమిళనాడు రాజకీయాలు కీలకమైన మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటిదాకా త్రిముఖ పోటీ సాగుతుందని అంతా భావించారు. కానీ సడెన్ గా మాజీ సీఎం జయలలిత సహచరి నేస్తం అయిన శశికళ ఎంట్రీ ఇచ్చారు. ఆమె లేటెస్ట్ గా రామనాథపురం లో జరిగిన బహిరంగ సభలో కొత్త పార్టీ ప్రకటన చేశారు. ఈ కొత్త పార్టీకి సంబంధించి పేరు ప్రకటించలేదు కానీ జెండా అయితే విడుదల చేశారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో ఉన్న ఆ జెండా మీద డీఎంకే తొలి సీఎం అన్నాదురై. ఆ తరువాత అన్నాడీఎంకే తరఫున సీఎంలుగా చేసిన ఎంజీఆర్, జయలలిత ఫోటోలు వరసగా ఉన్నాయి. అంటే ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల మద్దతుతో శశికళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారు అన్న మాట.

హాట్ కామెంట్స్ తో :

ఇదిలా ఉంటే తమ పార్టీ ఎంజీఆర్ జయలలిత బాటలో నడుస్తుందని శశికళ స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నామని ఆమె చెప్పారు. పేదలు అణగారిన వర్గాల కోసం పార్టీ పనిచేస్తునని ఆమె అన్నారు. తమ పార్టీ ద్రవిడ ఉద్యమాన్ని అనుసరిస్తుందని చెప్పారు.

సీఎం చాన్స్ వచ్చినా :

జయలలిత మరణం తరువాత ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ వచ్చినప్పటికీ తాను తప్పుకుని పన్నీర్ సెల్వం ని సీఎం గా చేశామని ఆమె చెబుతున్నారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ అరెస్టు అయితే ఆమెని ఏఐడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించింది. దీనిని ఆమె జీర్ణించుకోలేకపోయారు అని అంటారు. తాను ఎంతో నమ్మిన వారే ఈ విధంగా ఇలా చేయడం పట్ల ఆమె ఆగ్రహంగా ఉన్నారని చెబుతారు. ఇక జయలలితను తానే చంపాను అని తన మీద దుష్ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేసు నుంచి తాను తప్పుని పళని స్వామిని సీఎం గా చేయడం తాను చేసిన అతి పెద్ద తప్పు అని ఆమె అంటున్నారు. తాను సీఎం గా చేస్తే అత్యంత అవమానకరంగా పళని స్వామి పార్టీ నుంచి తనను గెంటేశారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మార్క్ చూపిస్తాను అంటూ :

తాను ఏమిటో ఇపుడు అంతా చూస్తారు అని ఆమె అంటున్నారు. రాజకీయాల్లో తన మార్క్ ని చూపిస్తాను అని ఆమె ప్రకటించారు. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ముందుకు వస్తున్న శశికళ తన పార్టీకి సంబంధించిన పేరు ని తొందరలో ప్రకటిస్తారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే శశికళ పార్టీ కనుక పోటీకి వస్తే తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు పార్టీలు రంగంలో ఉన్నట్లు అవుతుంది. మరి ఈ చతుర్ముఖ పోటీలో ఎవరు గెలుస్తారు ఎవరు ఎవరి ఓట్లు చీలుస్తారు అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.