Begin typing your search above and press return to search.

ఎస్ ఏ ఎస్ గ్రూప్ సర్వే : ఓట్లూ సీట్లూ తగ్గినా బీయారెస్ దే గెలుపు...

ఈ సారి కూడా బీయారెస్ తెలంగాణాలో అధికారంలోకి వస్తుందని ఈ సర్వే తేల్చింది. అయితే ఓట్లూ సీట్లు తగ్గుతాయని పేర్కొనడం విశేషం.

By:  Tupaki Desk   |   30 Oct 2023 9:01 AM GMT
ఎస్ ఏ ఎస్ గ్రూప్ సర్వే : ఓట్లూ సీట్లూ తగ్గినా బీయారెస్ దే గెలుపు...
X

హోరా హోరీ పోటీ అనాల్సి ఉంది. అధికారంలో మూడవసారి కూర్చోవడానికి బీయారెస్ ఉవ్విళ్ళూరుతోంది. అలా కాదు, ఈసారి వచ్చేది మేమే అంటోంది కాంగ్రెస్. మేమూ గెలుస్తామని అంటోంది బీజేపీ. మరి తెలంగాణాలో పరిస్థితి ఎలా ఉంది. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అన్న దాని మీద శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ సర్వే చేసిన సంచలన సర్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.


ఈ సారి కూడా బీయారెస్ తెలంగాణాలో అధికారంలోకి వస్తుందని ఈ సర్వే తేల్చింది. అయితే ఓట్లూ సీట్లు తగ్గుతాయని పేర్కొనడం విశేషం. ఎస్ ఏ ఎస్ సర్వే ప్రకారం చూస్తే కనుక బీయారెస్ కి 42.5 శాతం ఓట్ల షేర్ వస్తుందని అలాగే 64 నుంచి 70 దాకా సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. అదే విధంగా చూస్తే కాంగ్రెస్ కి 36.5 శాతం ఓట్ల షేర్ వస్తుందని, సీట్లు 37 నుంచి 43 దాకా వస్తాయని పేర్కొంది.

ఇక బీజేపీ 10.75 శాతం ఓట్ల షేర్ తో అయిదారు సీట్లు సాధిస్తుందని, మజ్లీస్ పార్టీ విషయానికి వస్తే 2.75 శాతం ఓట్ల షేర్ తో ఆరేడు సీట్లు వస్తాని, ఇతరులు 7.5 శాతం ఓట్ల షేర్ తో ఒకటి లేదా రెండు సీట్లు సాధిస్తారని పేర్కొంది.

ఇక హోరా హోరీ పోరు గా ఆరు సీట్లు ఉంటాయని ఇందులో బీయారెస్ కి మూడు కాంగ్రెస్ కి రెండు, బీజేపీకి ఒక సీటు రావచ్చు అని మూడ్ ఆఫ్ తెలంగాణా పేరిట ఎస్ ఏ ఎస్ సంచలన సర్వే విడుదల చేసింది. ఈ సర్వే అక్టోబర్ 28 నాటి దాకా చేసింది. ఏకంగా రాండం సర్వేతో పాటు సెలక్టివ్ శాంపిల్ మెదడ్ తో ఈ సర్వే చేశారు.

తెలంగాణాలోని 110 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం రెండు లక్షల అరవై అయిదు వేలమందిని సర్వేలో తీసుకున్నారు. 820 ఎన్యూమరేటర్స్ తో ఈ సర్వే సాగింది. వివిధ వర్గాలను వివిధ ప్రాంతాలను అన్ని కేటగిరీలను టచ్ చేస్తూ సంపూర్ణంగా ఈ సర్వే సాగినట్లుగా ఎస్ ఏ ఎస్ గ్రూప్ ప్రతినిధులు పేర్కొన్నారు.

తెలంగాణాలో హోరా హోరీ పోరు సాగుతుందని కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంటుందని వస్తున్న సర్వేలకు భిన్నంగా ఈ సర్వే ఉండడం విశేషం. అయితే 2018లో బీయారెస్ అధికారంలోకి వస్తుందని తాము చెప్పామని అదే నిజం అయిందని ఎస్ ఏ ఎస్ గ్రూప్ అంటోంది. అలాగే ఇటీవల కర్నాటక ఎన్నికల్లో తాము చెప్పిన ప్రకారమే ఫలితాలు వచ్చాయని ట్రాక్ రికార్డుని కూడా చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే ఈ సర్వే మాత్రం చాలా ఆసక్తికరంగానే ఉందని చెప్పాల్సి ఉంది. రానున్న రోజులలో ప్రీ పోల్ సర్వే ఎగ్జిట్ పోల్ సర్వేను కూడా ప్రకటిస్తామని శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ చెబుతోంది. ఇక రానున్న కాలంలో మారే పరిణామాలను బట్టి కూడా రిజల్ట్స్ లో ఏమైనా తేడా ఉంటే ఉండొచ్చు అని ఎస్ ఏ ఎస్ గ్రూప్ పేర్కొనడం విశేషం.