Begin typing your search above and press return to search.

బీజేపీలో పార్టీని విలీనం చేసిన స్టార్ హీరో.. కారణం ఇదేనంట!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   12 March 2024 11:14 AM GMT
బీజేపీలో పార్టీని విలీనం చేసిన స్టార్  హీరో.. కారణం ఇదేనంట!
X

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి హ్యట్రిక్ కొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారంలోకి వచ్చి తీరాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో దానికోసం ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమైపోయారు. ఈ సమయంలో తమిళనాడు బీజేపీలో ఒక పార్టీ విలీనం అయ్యింది.

అవును... వచ్చే ఎన్నికల్లో ప్రతీ ఓటూ, ప్రతీ సీటు అత్యంత కీలకంగా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ భావిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఉత్తరాధిలో బీజేపీ బలంగా ఉంటే.. దక్షిణాదిలో కాంగ్రెస్ బలపడుతుందని అంటున్నారు. అయితే అనూహ్యంగా దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో తన పార్టీని భారతీయ జనతాపార్టీలో స్టార్ హీరో శరత్ కుమార్ విలీనం చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ తన నేతృత్వంలోని ఆల్ ఇండియా సమత్తువ మక్కల్ కట్చి (ఏ.ఐ.ఎస్.ఎం.కే) ని బీజేపీలో విలీనం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఇది ప్రజల కోసం, దేశం కోసం తీసుకున్న నిర్ణయంగా తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల గర్వంగాను, సంతోషంగానూ ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో శరత్ కుమార్ పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

కాగా... శరత్ కుమార్ 2007లో ఏ.ఐ.ఎస్.ఎం.కే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్నాడీఎంకే తో ఆయన చాలాకాలంగా అనుబంధం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీచేసిన ఆ పార్టీ రెండు సీట్లలో గెలుపొందింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ... అనూహ్యంగా అన్నట్లుగా ఆయ్యన తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు!

మరోవైపు.. మరో సీనియర్ నటుడు, యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్.. తన పార్టీ మక్కల్ నీది మైయం పార్టీ కొద్ది రోజుల క్రితం డీఎంకే, కాంగ్రెస్ లతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో స్టార్ హీరో దళపతి విజయ్ సొంత పార్టీని స్థాపించిన సంగతీ తెలిసిందే!