Begin typing your search above and press return to search.

బోయ్ ప్రెండ్ సిస్ట‌ర్ తో సారా టెండూల్క‌ర్!

భార‌త క్రికెట‌ర్ శుభ్ మాన్ గిల్- సారా టెండూల్క‌ర్ మ‌ధ్య ప్రేమాయ‌ణం సాగుతుంద‌ని ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 Jan 2024 2:30 PM GMT
బోయ్ ప్రెండ్ సిస్ట‌ర్ తో సారా టెండూల్క‌ర్!
X

భార‌త క్రికెట‌ర్ శుభ్ మాన్ గిల్- సారా టెండూల్క‌ర్ మ‌ధ్య ప్రేమాయ‌ణం సాగుతుంద‌ని ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. క‌లిసి పార్టీల‌కు వెళ్ల‌డం...ముంబై వీధుల్లో చ‌క్కెర్లు కొట్ట‌డం...సీక్రెట్ వెకేష‌న్స్ లాంటివి ఇప్ప‌టికే ఇద్ద‌రి మ‌ధ్య బాండింగ్ ని రివీల్ చేస్తున్నాయి. కానీ ఆ రిలేష‌న్ షిప్ పై ఇంత వ‌ర‌కూ ఎలాంటి అధికారిక స‌మ‌చారం లేదు. అలాగ‌ని ఈ ప్ర‌చారాన్ని ఖండించ‌లేదు.


ఈ నేప‌థ్యంలో వీరిద్దరి బాండింగ్ ఎంత్ స్ట్రాంగ్ గా ఉంది? అన‌డానికి మ‌రో వీడియో కూడా లీకైంది. ఇందు లో శుభ్ మాన్ గిల్ సోద‌రి ష‌హ‌నీల్ గిల్ తో సారా క‌నిపించింది. ఇద్ద‌రు లేట్ నైట్ పార్టీని ఎంజాయ్ చేసి వ‌స్తోన్నస‌మ‌యంలో ఇలా కారులో చిక్కారు. ఫోటోలు తీస్తుంటే సారా ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని క‌ప్పేసుకునే ప్ర‌య‌త్నం చేసింది. కెమెరాల్నిచూసి తెగ సిగ్గు ప‌డిపోయిందంటే న‌మ్మాలి.

ఆ ప‌క్క‌నే కూర్చుని ఉన్న ష‌హానీగీల్ మాస్క్ ధ‌రించింది. ఆమె పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌క‌పోవ‌డంతో కెమెరా లు అటువైపుగా ఫోక‌స్ కాలేదు. సిగ్గులు ఒల‌క‌బోస్తున్నా సారా వైపై కెమెరా క‌ళ్ల‌న్నీ ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతుంది. శుభ‌మ‌న్ సోద‌రితో క‌నిపించిందంటే సారా టెండూల్క‌ర్ వ్య‌వ‌హారం చాలా దూరం వెళ్లింద‌ని మీడియాలో క‌థ‌నాలు ఊపందుకుంటున్నాయి.

సారా అప్పుడే గిల్ ఫ్యామిలీ మెంబ‌ర్ లా అందరితో క‌లిసిపోతుంది అన‌డానికి ఈవీడియో ని ఉద‌హ రించొచ్చు. సారా-శుభ‌మ‌న్ ఇద్ద‌రు ఓ కామ‌న్ ప్రెండ్ ద్వారా స్నేహితుల‌య్యారు. ఆ స్నేహం ఇప్పుడు ప్రేమ‌వ‌ర‌కూ దారి తీసిన‌ట్లుగా తెలుస్తుంది. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇక వ‌ర‌ల్డ్ క‌ప్ లో గిల్ బ్యాటింగ్ చేస్తుంటే సారా ఎంత‌లా హ‌డావుడి చేసిందో గుర్తిండే ఉంటుంది.