Begin typing your search above and press return to search.

18వ శక్తి పీఠం... ఏడున్నర దశాబ్దాల తరువాత తెరచుకుంది !

విశేషం ఏంటి అంటే 18వ శక్తిపీఠంగా భావించే శారదామాత ఆలయంలో ఈ ఏడాది మొదటిసారిగా దేవీ నవరాత్రులను నిర్వహించడం. ఇది కాశ్మీరులోనే అత్యంత శక్తివంతమైన పీఠంగా ఆరాధిస్తారు.

By:  Tupaki Desk   |   19 Oct 2023 1:49 PM GMT
18వ శక్తి పీఠం... ఏడున్నర దశాబ్దాల తరువాత తెరచుకుంది  !
X

తెల్ల దొరలు మనలను పాలించి రెండు వందల ఏళ్ల పాటు నానా ఇబ్బందులు పెట్టారు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఇక వారు పోతూ పోతూ కూడా ఆరని తీరని చిచ్చు పెట్టేశారు. స్వాతంత్రం ఇచ్చే వేళ కూడా కుట్రతో వ్యవహరించారు. ఫలితంగా అన్నదమ్ములుగా ఉంటూ వచ్చిన పాకిస్థాన్, భారత్ రెండుగా విడిపోయాయి. దాంతో భారత సంస్కృతి ఆధ్యాత్మికత అన్నీ కూడా పూర్తిగా ఏమీ కాకుండా పోయాయి.

భారత దేశం అంటే పద్దెనిమిది శక్తిపీఠాల సమూహం. ఈ దేశంలో ఆసేతు హిమాచలం శక్తిపీఠాలు ఉన్నాయి. ఇవే భారత్ ని వేద భూమిగా పుణ్యభూమిగా చేశాయి అని అంతా నమ్ముతారు. అలాంటి శక్తిపీఠాల్లో పద్దెనిమిదవ శక్తిపీఠం పాక్ భారత్ విడిపోయిన సమయంలో భారత్ నుంచి వేరు పడిపోయింది.

దీంతో గత ఏడున్నర దశాబ్దాలుగా ఆ శక్తిపీఠంలో పూజలు లేవు. ఇక దేశ విభజన తరువాత కాశ్మీర్ మీద పాకిస్థాన్ దాడి చేసి మూడవ వంతు భూభాగాన్ని ఈ రోజు దాకా తన అధీనంలోనే ఉంచేసుకుంది. అదే సమయంలో కాశ్మీర్ లో కూడా 370 ఆర్టికల్ విధించడం వల్ల అనేక హిందూ దేవాలయాలకు పూజలు లేవు. అందులో శ్రీ శారదా మాత ఆలయం ఒకటి. ఇది ఆక్రమిత కాశ్మీర్ కి కేవలం ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంది.

ఇది కుప్వారా జిల్లాలోని ట్విట్టాల్ గ్రామంలో ఉది. ఈ శారదా మాత ఆలయాన్ని ఒకటవ శతాబ్దంలో కుషాణుల సామ్రాజ్య కాలంలో నిర్మించారు అని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చాక 2019లో కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేశాక కాశ్మీర్ లోయ అంతా పూర్వపు స్థితికి వచ్చింది. అక్కడ పర్యాటక రంగం ఊపందుకుంది. దేశం మొత్తం అక్కడికి వెళ్తోంది. దాంతో పాటు పాత ఆలయాలు ప్రతిష్టాత్మకమైన ఆలయాలు ఇపుడు పూజాదికాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయి.

విశేషం ఏంటి అంటే 18వ శక్తిపీఠంగా భావించే శారదామాత ఆలయంలో ఈ ఏడాది మొదటిసారిగా దేవీ నవరాత్రులను నిర్వహించడం. ఇది కాశ్మీరులోనే అత్యంత శక్తివంతమైన పీఠంగా ఆరాధిస్తారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి శారదామాత పీఠంలో దసరా ఉత్సవాలు జరగడంతో స్థానిక భక్తులు అంతా అమ్మవారిని సేవించుకుంటున్నారు. పర్యాటకులు కూడా అమ్మ వారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు.

ఒక విధంగా ఇది శుభ పరిణామంగా ఆధ్యాత్మిక వేత్తలు చూస్తున్నరు. కాశ్మీర్ కి పూర్వపు వైభవం కచ్చితంగా దక్కుతుంది అని అంటున్నారు. అందులో భాగంగా శక్తి పీఠం తలుపులు తెరచుకున్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ శారదామాత దేవాలయం మొదటి శతాబ్దంలో ఇప్పటికీ ఇక్కడ అనేక దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని పేర్కొంటున్నారు. వాటిని బాగుచేసే పనిలో కేంద్ర ప్రభుత్వం స్థానిక అధికార యంత్రాంగం ఇపుడు నిమగ్నమై ఉన్నాయని చెప్పాలి. మొత్తానికి ఈసారి దసరాకు ఇదే అసలైన స్పెషల్ అని కూడా చెప్పాలి.