17 మంది ఉత్తమ ఎంపీల్లో తెలుగోళ్లు ఒక్కరూ లేరే!
కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తమ ఎంపీలకు అవార్డులను అందించింది.
By: Tupaki Desk | 28 July 2025 9:41 AM ISTకేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తమ ఎంపీలకు అవార్డులను అందించింది. వీటిని `సంసద్ రత్న` అంటారు. ఈ అవార్డుల కింద ప్రశంసాపత్రంతోపాటు.. రూ.5 లక్షల నగదును కూడా ఇస్తారు. ఈ ఏడాది 17 మంది ఎంపీలను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. అయితే.. వీరిలో ఒక్క తెలుగు ఎంపీ కూడా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. పోనీ.. బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఈ అవార్డులను ఇచ్చి ఉంటే.. ఈ సమస్య వచ్చేది కాదు. ఈ ప్రశ్నలు కూడా తలెత్తేవి కాదు. కానీ.. ఈ అవార్డులకు ప్రతిపక్షం కాంగ్రెస్ సహా.. మోడీపై నిరంతరం నిప్పులు చెరిగే శివసేన పార్టీలకు చెందిన ఎంపీలు కూడా ఉన్నారు.
కానీ.. ఎటొచ్చీ.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ఒక్క ఎంపీ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోక పోవడం గమనార్హం. నిజానికి గత మూడేళ్ల పనితీరు ఆధారంగా ఈ అవార్డులను కేంద్రం ప్రకటించింది. సో.. దీనిని బట్టి ఏపీలో వైసీపీ, టీడీపీ ఎంపీలకు అవకాశం దక్కి ఉండాలి. లేదా.. తెలంగాణకు చెందిన ఎంపీలకైనా ఒకరిద్దరికి ఛాన్స్ వచ్చి ఉండాలి. కానీ, ఒక్కరికీ రాలేదు. దీనిని బట్టి రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీల పనితీరు ప్రశ్నార్థకంగా మారిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వీరే సంసద్ రత్నలు..
1) సుప్రియా సూలే (ఎన్సీపీ-ఎస్పీ)
2) రవి కిషన్ (బీజేపీ)
3) నిశికాంత్ దుబె (బీజేపీ)
4) అర్వింద్ సావంత్ (శివసేన-ఉద్దవ్ వర్గం)
5) భర్తృహరి మెహ్‌తా (బీజేపీ)
6) ఎన్‌కే ప్రేమచంద్రన్ (ఆర్ ఎస్‌పీ)
7) సుప్రియా(ఎన్సీపీ)
8) శ్రీరంగ్ అప్పా బార్నె (శివసేన)
9) స్మిత ఉదయ్ వాగ్ (బీజేపీ)
10) నరేశ్ మహాస్కే (శివసేన)
11) వర్ష గైక్వాడ్ (కాంగ్రెస్)
12) మేధ కులకర్ణి (బీజేపీ)
13) ప్రవీణ్ పటేల్ (బీజేపీ)
14) విద్యుత్ బారన్ మహతో (బీజేపీ)
15) దిలీప్ సైకియా (బీజేపీ)
16) చరణ్‌జీత్ సింగ్ చన్ని(కాంగ్రెస్)
17) దినేష్ శర్మ(బీజేపీ)
