#గుసగుస.. భన్సాలీ ఈసారైనా మారతాడా?
దేవదాస్, రామ్ లీలా, హమ్ దిల్ దే చుకే సనమ్, పద్మావత్, భాజీరావు మస్తానీ, గంగూభాయి కథియావాడీ ఇవన్నీ కథల పరంగా ఎలా ఉన్నా కానీ, భారీతనం విషయంలో భన్సాలీ ఎక్కడా రాజీకి రాలేదు.
By: Tupaki Desk | 5 Jun 2025 12:15 AM ISTభారీతనం నిండిన రాజప్రాకారాలు (సెట్లు), కాస్ట్యూమ్స్, కళాత్మక ధృక్పథం.. ఇవన్నీ మూసలో పోసినట్టుగా ఉంటాయి భన్సాలీ సినిమాల్లో. ప్రతి సినిమాలో భారీ సెట్లు చూడటం రొటీన్. కాస్ట్యూమ్స్ పరంగాను ఒకే పంథాలో ఉంటాయి. దానికి తగ్గట్టుగానే కళాత్మకమైన నేపథ్యాన్ని ఎంచుకుని ఎమోషన్స్ ని రక్తి కట్టించగల ఆర్టిస్టులతో భన్సాలీ ప్రయోగాలు మనసుపై శాశ్వత ముద్రను వేస్తాయి. అలాగే భన్సాలీ సినిమాల్లో రాజరికం, జెమీందారీ పంథా కూడా భారీతనానికి ఒక కారకంగా పని చేస్తుంది.
ప్రస్తుతం రణబీర్-ఆలియా- విక్కీ కౌశల్ వంటి భారీ తారాగణంతో 'లవ్ అండ్ వార్' అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా అతడు పాత విధానాన్ని అనుసరిస్తున్నారా? అవే భారీ సెట్లు, కాస్ట్యూమ్స్, ఎమోషన్స్ కోసం తపిస్తున్నాడా? ఒక హృద్యమైన ప్రేమకథలో ఎమోషన్స్ ని రగిలిస్తూ, వార్ ని నడిపిస్తున్నాడా? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు. పాత్రలు పాత్రధారుల గురించి కొంత రివీల్ చేసాడు కానీ, అసలు ఈ సినిమా కథేమిటన్నది భన్సాలీ ఇంతవరకూ లీకివ్వలేదు.
దేవదాస్, రామ్ లీలా, హమ్ దిల్ దే చుకే సనమ్, పద్మావత్, భాజీరావు మస్తానీ, గంగూభాయి కథియావాడీ ఇవన్నీ కథల పరంగా ఎలా ఉన్నా కానీ, భారీతనం విషయంలో భన్సాలీ ఎక్కడా రాజీకి రాలేదు. ఇప్పుడు కూడా అవే రాజప్రకారాల్లో భారీ కాస్ట్యూమ్స్ ధరించిన ఆర్టిస్టులతో ప్రేమకథల్ని, రోమాంచిత అనుభవాన్ని అందిస్తున్నాడా? లేక ఇంకేదైనా గొప్ప విషయాన్ని అతడు తెరపై కొత్తగా చూపిస్తున్నాడా? అన్నది వేచి చూడాలి.
అంతులేని ఆవేదనను అనుభవించే హీరామండి వేశ్యల కథల్ని కూడా విభిన్నంగా చూపించాలని ప్రయత్నించాడు భన్సాలీ. దీనిపై విమ్శలు చెలరేగాయి. అందుకే ఇప్పుడు 'లవ్ అండ్ వార్' విషయంలో గత తప్పిదాల్ని వదిలి, ఈసారి అయినా కొత్తగా ఏదైనా చూపిస్తాడని అభిమానులు వేచి చూస్తున్నారు. ప్రేమ- యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు సినిమా తీస్తున్నాడు. దీనికి స్పాన్ చాలా ఎక్కువ. అసలు యుద్ధం దేనికోసం? ప్రేమకోసమేనా లేదా ఇంకేదైనా ఉందా? అన్నది అతడు హింట్ ఇస్తాడేమో చూడాలి.
