Begin typing your search above and press return to search.

26 ఏళ్ల క్రితం నాటి హిట్ ఓ గొప్ప జ్ఞాప‌కం!

స‌ల్మాన్ ఖాన్- ఐశ్వ‌ర్యారాయ్- అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంజ‌య‌ల్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన `హ‌ద్ దిల్ దే చుక్ స‌న‌మ్` నాటి క్లాసిక్ చిత్రాల్లో ఒక‌టి.

By:  Tupaki Desk   |   19 Jun 2025 8:30 AM IST
26 ఏళ్ల క్రితం నాటి హిట్ ఓ గొప్ప జ్ఞాప‌కం!
X

స‌ల్మాన్ ఖాన్- ఐశ్వ‌ర్యారాయ్- అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంజ‌య‌ల్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన `హ‌ద్ దిల్ దే చుక్ స‌న‌మ్` నాటి క్లాసిక్ చిత్రాల్లో ఒక‌టి. తండ్రి కార‌ణంగా ప్రేమికులు ఎలా విడిపోయారు. తిరిగి ఆ ప్రేమికుల్ని క‌ల‌ప‌డానికి అజ‌య్ దేవ‌గ‌ణ్ ఎంత‌టి సాహ‌సం చేసాడు? అన్న పాయింట్ ను సంజ‌య్ ఎంతో హృద్యంగా చిత్రీక‌రించారు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ల‌వ్ స్టోరీల్లో ఇదో స్వ‌చ్చ‌మైన ప్రేమ క‌థ‌గా నిలిచిన చిత్రం.

తాజాగా ఈ సినిమా విడుద‌లై 26 ఏళ్లు పూర్త‌వుతుంది. ఈనేప‌థ్యంలో ఆనాటి జ్ఞాపకాల‌ను..స‌వాళ్ల‌ను సంజ‌య్ ఓ ఇంట‌ర్వ్యూలో పంచుకున్నారు. `నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి చిత్రం ` ఖామోషీ: దిమ్యూజిక‌ల్` అప్ప‌టికే రిలీజ్ అయిన ప్లాప్ అయింది. ఆ ఫ‌లితాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రేమ క‌థ‌ను చూపించాల నుకున్నా. అది ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోయ‌వాల‌ని బ‌లంగా నిర్ణ‌యించుకున్నా.

అలా వ‌చ్చిన చిత్ర‌మే `హ‌మ్ దిల్ దే చుక్ స‌న‌మ్`. నందిని పాత్ర‌కు ఐశ్వ‌ర్యా రాయ్ ప్రాణం పోసింది. నేను అనుకున్న విధంగా న‌టించింది. ద‌ర్శ‌కుడి విజ‌న్ కు త‌గ్గ న‌టీన‌టులు దొరికిన‌ప్పుడు అలాంటింది సాధ్య‌మ వుతుంది. ఐశ్వర్య‌ను తెర‌పై చూసిన‌ప్పుడు నాకెంతో సంతోషం క‌లిగింది. ప్రియురాలిగా ఎంతో గొప్పగా న‌టించింది. స‌ల్మాన్ ఖాన్ అంత గొప్ప పెర్పార్మెన్స్ ఇచ్చారు. ఆయ‌నే కాదు ప్ర‌తీ ఒక్కరూ సినిమాకు ప్రాణం పెట్టి ప‌నిచేయ‌డంతోనే సాధ్య‌మైంది.

స‌ల్మాన్-ఐష్ క‌లిసే విధంగా తుది స‌న్నివేశాలు మార్చ‌మ‌ని చాలా మంది కోరారు. కానీ నా నిర్ణ‌యం మాత్రం మార్చుకోలేదు. అనుకున్న‌ది అనుకున్న‌ట్లు తీసాను. అయితే ఖామోషీ స‌మయంలో డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి ఒత్తిడి రావ‌డంతో అందులో కొన్ని స‌న్నివేశాలు త‌న‌కు ఇష్టం లేక‌పోయినా మ‌ర్చాల్సి వ‌చ్చింద‌ని గుర్తు చేసుకు`న్నారు.