Begin typing your search above and press return to search.

తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థిగా సానియా మీర్జా!?

ఇందులో భాగంగా... టెన్నీస్ స్టార్ సానియా మీర్జా పేరును పరిశీలిస్తున్నారని.. ఆల్ మోస్ట్ ఆమె పేరు కన్ ఫాం అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   27 March 2024 11:58 AM GMT
తెలంగాణలో కాంగ్రెస్  అభ్యర్థిగా సానియా మీర్జా!?
X

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బకు లోక్ సభ ఎన్నికల్లో రివేంజ్ తీర్చుకోవాలని బీఆరెస్స్ భావిస్తుందని చెబుతుండగా.. ఆ పోరు కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లి మెరుగైన ఫలితాలు సాధించాలని బీజేపీ భావిస్తుందని అంటున్నారు.

ఈ సమయంలో ఇప్పటికే బీజేపీ, బీఆరెస్స్ అభ్యర్థులు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వీలైనంత తొందర్లో కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ కూడా విడుదలవ్వొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన అభ్యర్థుల విషయంలో... బీజేపీ నుంచి హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలతను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈసారి హైదరాబాద్ పై ప్రత్యకేంగా ఫోకస్ పెట్టినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఒక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.

అవును... హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... టెన్నీస్ స్టార్ సానియా మీర్జా పేరును పరిశీలిస్తున్నారని.. ఆల్ మోస్ట్ ఆమె పేరు కన్ ఫాం అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈమె పేరును కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్ధీన్ ప్రతిపాదించారని తెలుస్తుంది.

కాగా... 1977, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్స్ పార్టీకి చెందిన కేఎస్ నారాయణ హైదరాబాద్ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒవైసీ కుటుంబానిదే హవా. ఇందులో భాగంగా... ఆరుసార్లు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, ఆ తర్వాత ఆయన పెద్ద కుమారుడు అసదుద్ధీన్ ఒవైసీ నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఈదఫా ఎంఐఎం కి గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తోన్న కాంగ్రెస్ పార్టీ.. సానియా మీర్జాను బరిలోకి దింపాలని భావిస్తోందని కథనాలొస్తున్నాయి!