Begin typing your search above and press return to search.

రూ. 40 కోట్ల మనీలాండరింగ్..! ఇన్ స్టా ఇన్ ఫ్లూయెన్సర్ తీరే వేరు..

సందీపా విర్క్ ఈమె గురించి ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో 12 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

By:  Tupaki Desk   |   14 Aug 2025 3:52 PM IST
రూ. 40 కోట్ల మనీలాండరింగ్..! ఇన్ స్టా ఇన్ ఫ్లూయెన్సర్ తీరే వేరు..
X

ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లూయెన్సర్ అంటే ఏం ఊహిస్తాం.. మంచి మంచి రీల్స్ ఉంటాయి, ఏవో కొన్ని కొన్ని ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుంటారని.. కానీ ఇక్కడో యువతి రూ. 40 కోట్ల మనీ లాండరింగ్ చేసింది. ఈ కేసు ఇటవల వెలుగులోకి వచ్చింది. దీంతో ఈడీ నుంచి ఆమె ఫాలోవర్స్ వరకు అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ సెల్ లోకి వచ్చిన కొత్తలో కేవలం ఎంటర్ టైన్ మెంట్ రీల్స్ చేసే వారు మాత్రమే కానీ.. రాను రాను ఆ విధానం పూర్తిగా మారిపోయింది. ఇన్ స్టాను బిజినెస్ కు ఫ్లాట్ ఫాంగా మార్చుకున్నారు కొందరు ఇన్ ఫ్లుయెన్సర్లు. తక్కువ కాలంలో ఎక్కువ ఫేం కావడం.. లెక్కకు మించి ఫాలోవర్స్ వెరిసి తమను తాము గొప్పగా ఊహించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వీరు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.

సందీపా విర్క్ ఈమె గురించి ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో 12 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంత మంది ఫాలోవర్స్ ఉండడంతో బిజినెస్ మొదలుపెట్టింది. ఎఫ్‌డీఏ ఆమోదించిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసింది. మార్కెటింగే కాదు.. హైబూకేర్.కామ్ (hyboocare.com) వెబ్ సైట్ ప్రారంభించి తమ ఉత్పత్తులను అమ్మడం మొదలు పెట్టింది. దీంతో మరింత పాపులర్ అయ్యింది. రియలన్స్ క్యాపిటల్ మాజీ డైరెక్టర్ తో సంబంధాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది.

విర్క్ రూ. 40 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది. ఆమెపై బీఎన్ఎస్ 406, 420లో మొహాలీలోని పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసింది. విర్క్ కు సంబంధించి మంగళ, బుధవారాల్లో ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో తనిఖీలు నిర్వహించింది. ఇన్ ఫ్లూయెన్సర్ గా విర్క్ మోసపూరితంగా కోట్లాది రూపాయాల డబ్బును సంపాదించిందని ఈడీ స్పష్టం చేసింది. ఆమె విక్రయించే బ్యూటీ ప్రొడక్ట్ ఉనికిలో లేవని చెప్పింది. ఇంకా ఆమె వెబ్ సైట్ లో సైతం యూజర్ ఫీచర్లు లేవని వివరించింది.

రియలన్స్ క్యాపిటల్ మాజీ డైరెక్టర్ సాయంతో 2018లో రియలన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లి. నుంచి రూ. 18 కోట్ల విలువైన నిధులను ఆమె దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే రియలన్స్ క్యాపిటల్ మాజీ డైరెక్టర్ మాత్రం తనకు విర్క్ తో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకచ్చారు. విర్క్ ను కోర్టు ఎదుట హాజరుపరచగా న్యాయస్థానం శుక్రవారం వరకు ఈడీ కస్టడీలో ఉండాలని ఆదేశించింది.