Begin typing your search above and press return to search.

ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతున్నారా ?

సమావేశాలు మొదలైన దగ్గర నుండి అసెంబ్లీ లాబీల్లో ఎంఎల్ఏల జీతాల పెంపు విషయమై పెద్ద చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   22 Sep 2023 5:13 AM GMT
ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతున్నారా ?
X

చట్టసభల్లో ప్రజాప్రతినిధుల జీతాలు పెరగబోతున్నాయా ? అవుననే చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం మొదలైన విషయం తెలిసిందే. సమావేశాలు మొదలైన దగ్గర నుండి అసెంబ్లీ లాబీల్లో ఎంఎల్ఏల జీతాల పెంపు విషయమై పెద్ద చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని ఆరా తీసినపుడు శాసనసభ సెక్రటేరియట్ అధికారులు కూడా అవుననే చెప్పారు. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఈ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముందని చెప్పారు.

ప్రస్తుతం ప్రతి ఎంఎల్ఏ అలవెన్సులతో కలిసి జీతం నెలకు సుమారు 2 లక్షల వరకు అందుతోంది. దీనికి కొత్తగా రెడీ అవుతున్న బిల్లులో రు. 30 వేల నుండి రు. 50 వేల వరకు పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం. అంటే 30 వేలు పెరిగితే మొత్తం జీతం రు. 2.30 లక్షలవుతుంది. అదే రు. 50 వేలు పెరిగితే జీతం మొత్తం రు. 2.80 లక్షలవుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఎంఎల్ఏల జీతాలన్నీ ఒకే విధంగా లేదు.

అసెంబ్లీలో ఎంఎల్ఏల సంఖ్యను బట్టి, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని బట్టి ప్రభుత్వాలు జీతాలను నిర్ణయించుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణాలో అత్యధికంగా ఎంఎల్ఏ జీతం నెలకు రు. 2.5 లక్షలుంది.

తర్వాత స్ధానంలో ఢిల్లీ ఎంఎల్ఏలు నెలకు తలా రు. 2.10 లక్షలు అందుకుంటున్నారు. అత్యధిక జీతాలున్న ఎంఎల్ఏల జాబితాలో ఏపీ ఐదవస్ధానంలో ఉంది. దేశంమొత్తంమీద అతితక్కువ జీతాలు అందుకుంటున్న ఎంఎల్ఏలు త్రిపురలో ఉన్నారు. వీళ్ళ జీతం నెలకు రు. 17,500 మాత్రమే.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఎంఎల్ఏల జీతానికి ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. నిజానికి అత్యధిక ఎంఎల్ఏలు అచ్చంగా జీత, బత్యాల మీదే బతికేయటంలేదు. చాలామందికి జీతాలన్నది అసలు లెక్కలోకే రాదు. వీళ్ళ ఆదాయమార్గాలు వేరే రూపాల్లో ఉంటాయి. అయినా సరే ఎంఎల్ఏలకు జీతాలు, మళ్ళీ దాన్ని పెంచటం అంటేనే ఆశ్చర్యంగా ఉంది. మరి ప్రచారం జరుగుతున్నట్లే జీతాలు పెంచుతారా లేకపోతే ఇంకా ఎక్కువ ఇస్తారా అన్నది చూడాలి.