Begin typing your search above and press return to search.

నేను నంబర్ 2 కాదంటున్న సజ్జల

‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నేను నంబర్ 2 అన్న విషయం అబద్దం.

By:  Tupaki Desk   |   26 April 2024 3:41 PM IST
నేను నంబర్ 2 కాదంటున్న సజ్జల
X

‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నేను నంబర్ 2 అన్న విషయం అబద్దం. జగన్ ఆయన పెట్టుకున్న పార్టీ నుండి ఆయన కష్టం మీద అధికారంలోకి వచ్చాడు. ఏపీకి రాజధాని లేకుండా చేసిన పాపం చంద్రబాబు నాయుడుదే. రాజధాని పేరుతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు’ అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

జగన్‌ ఎన్నికల్లో చేయగలిగినవే చెప్పాడు. దానికి మించి చేశారు. . అవినీతిరహితంగా, పారదర్శకంగా, నాయకుల ప్రమేయం లేకుండా సంక్షేమ కార్యక్రమాలను జగన్‌ పూర్తిగా అమలు చేశారని సజ్జల అన్నారు. అధిక శాతం ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.

తాజా ఎన్నికలలో చంద్రబాబు చేసిన హామీలను అమలు చేయడానికి లక్షల కోట్ల రూపాయల నిధులు కావాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయని సజ్జల ఆశాభావం వ్యక్తంచేశాడు. కరోనా కష్టాలను అధిగమించి హామీలను అమలు చేస్తున్నామని సజ్జల చెప్పడం విశేషం.