Begin typing your search above and press return to search.

మధ్యలో నారా రోహిత్ ని తెచ్చిన సజ్జల

ఏపీలో బాబు జగన్ ల మధ్య పొలిటికల్ వార్ సాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. దాంతో హీట్ మరింత ఎక్కువ అవుతోంది.

By:  Satya P   |   24 Oct 2026 11:52 PM IST
మధ్యలో నారా రోహిత్ ని తెచ్చిన సజ్జల
X

ఏపీలో బాబు జగన్ ల మధ్య పొలిటికల్ వార్ సాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. దాంతో హీట్ మరింత ఎక్కువ అవుతోంది. ఈ నేపధ్యంలో షర్మిల కుమార్తె పెళ్ళి, దానికి జగన్ యెలహంక ప్యాలెస్ ఇవ్వనని అన్నారని ఆయనను కంస మామ అని కుటుంబ విలువలు లేవని చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. దీంతో బాబు మీద కూడా కౌంటర్లు వేసేందుకు వైసీపీ సిద్ధమైపోయింది. ఈ గొడవ మధ్యలో నటుడు నారా రోహిత్ ని తీసుకుని వచ్చారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.

నారా రోహిత్ పెళ్లిని తెచ్చి :

నారా రోహిత్ పెళ్ళి గత ఏడాది జరిగింది. నారా రోహిత్ చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు. అయితే రోహిత్ పెళ్ళిని చంద్రబాబు హైదరాబాద్ లో తాను కట్టుకున్న ప్యాలెస్‌లో ఎందుకు చేయలేదు అని సజ్జల రామక్రిష్ణారెడ్డి నిలదీస్తున్నారు. ఒక్కసారైనా వాళ్ల గురించి పట్టించుకున్నావా చంద్రబాబూ అని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు ఒక కొడుకుగా, అల్లుడిగా, అన్నగా ఫెయిల్. తన కొడుకుని పిల్ల సైకోగా తయారు చేసి తండ్రిగా ఫెయిల్ అయ్యారని సజ్జల హాట్ కామెంట్స్ చేశారు.

కుటుంబాలను లాగుతూ :

నిజం చెప్పాలంటే ఏపీ రాజకీయాల్లోకి కుటుంబాలు వచ్చేస్తున్నాయి. అలా వస్తున్నాయా లేక మధ్యలో తెస్తున్నారా అన్నది తెలియదు కానీ ఇది మంచి విధానం కాదని అంటున్నారు. జగన్ విషయంలో అది కుటుంబ వ్యవహారం అంటూనే బాబు ప్రస్తావించారు. దాంతో వైసీపీ ఒకటి అంటే నాలుగు అంటానని మొత్తంగా బాబు మీద విమర్శలు చేస్తోంది. దీని వల్ల ఢీ అంటే ఢీ రాజకీయమే సాగుతోంది అని అంటున్నారు.

వేడెక్కిపోతున్నా :

ఇప్పటికే ఏపీలో వైసీపీ టీడీపీ రెండు రాజకీయ శిబిరాలుగా విడిపోయారు. దాని ప్రభావం స్థానిక ఎన్నికల మీద గట్టిగానే ఉంది. ఆ ఎన్నిక అని కాదు ఏది జరిగినా పొలిటికల్ గా అటూ ఇటూ రీసౌండ్ చేస్తోంది. ఈ మధ్యలో కుటుంబ సభ్యులు వారి పెళ్ళిళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. షర్మిల పీసీసీ చీఫ్ గా ఉన్నారు. దాంతో పాటు ఆమె వైఎస్సార్ తనయగా ఉన్నారు. ఇక జగన్ కి ఆమెకు ఆర్థిక పరమైన విషయాల్లో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇపుడు అవి కాస్తా షర్మిల కూతురు పెళ్ళికి వేదికగా యలహంక ప్యాలెస్ ని నిర్ణయించడం దానికి జగన్ కాదని అన్నారని వార్తలు రావడంతో మరింత ముదిరాయి.

రాజకీయ రచ్చగానే :

అయితే ఇది కుటుంబ వ్యవహారం కంటే రాజకీయంగానే ఎక్కువగా టాపిక్ అవుతోంది. ఇపుడు చంద్రబాబుకు ఆయన తమ్ముడు కుమారుడు నారా రోహిత్ ని ముందు పెట్టి వైసీపీ విమర్శలు చేయడంతో మరో మలుపు తీసుకుంటోంది. మరి కుటుంబాలను కూడా తీసుకుని రావడం కుటుంబ విలువలు మీకు లేవంటే మీకు లేవని విమర్శలు చేసుకోవడం వల్ల రాజకీయ రచ్చ తప్ప ఒరిగేది ఏముందని అంటున్నారు.