Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే సురక్షితమైన విమాన సంస్థలు.. టాప్ 10 లిస్ట్ ఇదే!

ఇటీవల అహ్మదాబాద్ టు లండన్ ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైనప్పటి నుంచీ... విమాన ప్రయాణాలపై తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Jun 2025 10:07 PM IST
ప్రపంచంలోనే సురక్షితమైన విమాన సంస్థలు.. టాప్ 10 లిస్ట్ ఇదే!
X

ఇటీవల అహ్మదాబాద్ టు లండన్ ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైనప్పటి నుంచీ... విమాన ప్రయాణాలపై తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ప్రధానంగా భద్రత విషయపై చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమాన సంస్థలు ఏవి, అవి ఏయే దేశాల్లో ఉన్నాయనేది ఇప్పుడు చూద్దామ్..!

అవును... ప్రస్తుతం ఉన్న ప్రయాణ మార్గాల్లో అన్నింటికన్నా సురక్షితమైనది విమానయాన ప్రయాణం అని నిపుణులు చెబుతుంటారు. మిగిలిన మార్గాల్లో జరిగిన ప్రమాదాలతో పోలిస్తే విమాన ప్రయాణంలో ప్రమాదాల శాతం చాలా తక్కువని అంటారు. అయితే... ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు అనేకం జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ప్రధానంగా.. ఈ నెల 12వ తేదీన అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 274 మంది మరణించడం.. మృతుల్లో 241 మంది విమానంలో ఉన్నవారు ఉండటంతో ఈ ఘటన యావత్ భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆ ఘటన జరిగిన రెండు రోజులకే కేథార్ నాథ్ లో యాత్రికులను తరలించే క్రమంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. విమానప్రయాణాల్లో భద్రతపై పలువురు ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమాన సంస్థల జాబితా తెరపైకి వచ్చింది.

ఎయిర్ లైన్ రేటింగ్ సంస్థ ఇటీవల విడుదల చేసిన జాబితా ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమాన సంస్థగా ఎయిర్ న్యూజిలాండ్ నిలిచింది. దీని సగటు వయస్సు 9.5 సంవత్సరాలుగా ఉండగా... ఎలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ సమస్యలకు గురికాదని.. అద్భుతమైన పైలట్ నైపుణ్యం, ఆధునిక సాంకేతికతతో ఈ విమానయాన సంస్థ గుర్తింపు పొందింది.

ఇదే సమయంలో... రెండో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ సంస్థ ఉంది. ఎయిర్ న్యూజిలాండ్‌ తో పోలిస్తే.. 1.5 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచింది ఈ సంస్థ. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... గత 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఒక్క ప్రమాదం కూడా ఈ విమానాలకు జరగలేదు. క్వాంటాస్ సంస్థకు అత్యుత్తమ సేఫ్టీ రికార్డ్ ఉంది.

మూడో స్థానంలో హాంకాంగ్ కు చెందిన క్యాథే సంస్థ ఉండగా.. నాలుగో స్థానంలో ఖతార్ కు చెందిన ఖతర్ ఎయిర్ వేస్ ఉంది. గత కొన్నేళ్లుగా ఈ ఎయిర్ వేస్ సేఫ్టీ లో టాప్ ప్లేస్ లో సాగుతోంది. ఇదే సమయంలో.. ఐదో స్థానంలో దుబాయ్ కు చెందిన ఎమిరేట్స్ సంస్థ నిలిచింది. ఇది కూడా అత్యుత్తమ సేఫ్టీ రికార్డులను కలిగి ఉంది.

టాప్ - 10 సురక్షితమైన విమాన సంస్థలు!!:

1. ఎయిర్ న్యూజిలాండ్

2. క్వాంటస్

3. క్యాథే సంస్థ

4. ఖతార్ ఎయిర్ వేస్

5. దుబాయ్ ఎమిరేట్స్

5. వర్జిన్ ఆస్ట్రేలియా

6. ఎతిహాద్ ఎయిర్ వేస్

7. అన

8. ఈవీఏ ఎయిర్

9. కొరియన్ ఎయిర్

10. అలస్కా ఎయిర్ లైన్స్