Begin typing your search above and press return to search.

విశాఖలోకి ఎస్ కోట నియోజకవర్గం ?

అంతే కాదు గ్రామీణ నేపథ్యం పెద్దగా లేని విశాఖ జిల్లాకు ఆ లోటు తీరనుంది. అంతే కాదు విశాఖలో చేరడం ద్వారా ఎస్ కోటకు మహర్దశ మొదలుకానుంది.

By:  Satya P   |   7 Aug 2025 5:00 PM IST
విశాఖలోకి ఎస్ కోట నియోజకవర్గం ?
X

విశాఖ జిల్లాలోకి మరో కొత్త అసెంబ్లీ నియోజకవర్గం వచ్చి చేరనుంది అని అంటున్నారు. దాంతో ఇప్పటిదాకా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో చిన్న జిల్లాగా ఉన్న విశాఖ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పెద్ద జిల్లాగా మారనుంది. అంతే కాదు గ్రామీణ నేపథ్యం పెద్దగా లేని విశాఖ జిల్లాకు ఆ లోటు తీరనుంది. అంతే కాదు విశాఖలో చేరడం ద్వారా ఎస్ కోటకు మహర్దశ మొదలుకానుంది.

కూటమి హామీ మేరకు :

టీడీపీ కూటమి 2024 ఎన్నికల ప్రచారంలో ఎస్ కోటను విశాఖ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చాయి. ఆ మేరకు ఇపుడు హామీని నిలబెట్టుకోనున్నారు. విశాఖ జిల్లాను ఆనుకుని ఎస్ కోట ఉంది. దాంతో పాటు ఎస్ కోటలో అంతా అభివృద్ధి జరుగుతోంది. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా సాగుతోంది. అదే విధంగా ఎస్ కోటలో అనేక కీలకమైన ప్రాంతాలు ఉన్నాయి. అరకుతో ఎస్ కోటకు భౌగోళిక బంధం ఉంది. దాంతో టూరిజం స్పాట్ గా కూడా అభివృద్ధి చేసేందుకు వీలు అవుతుంది అని అంటున్నారు.

జీవీఎంసీ విస్తరణకు :

ఇక జీవీఎంసీ ఇప్పటిదాకా చూస్తే అనకాపల్లి దాకా విస్తరించి ఉంది. రేపటి రోజున ఎస్ కోట కూడా జీవీఎంసీలో కలిసే వీలు ఉంది. ఎందుకంటే విశాఖ జిల్లాలోకి ఆ నియోజకవర్గం రావడంతో అన్ని విధాలుగా అర్బన్ ఫ్లేవర్ తో తమ ప్రాంతం ఉంటుందని ష్తానికులు అంటున్నారు. అంతే కాదు తమ భూములకు రెక్కలు వస్తాయని చాలా మంది ఆశగా ఉన్నారు. ఎస్ కోట పరిసరాలు కూడా విశాఖతో భౌగోళికంగా అనుసంధానం అయి ఉన్న నేపథ్యంలో రానున్న రోజులలో కొత్తవలస పరిసర ప్రాంతాలు మరో మధురవాడగా అవతరిస్తాయని అంటున్నారు.

విజయనగరంలో అయిదే

ఇక ఈ పరిణామం కనుక జరిగితే విజయనగరం జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు కాస్తా అయిదు అవుతాయని అంటున్నారు. దాంతో ఒకనాడు పది అసెంబ్లీ సీట్లతో ఉన్న ఈ జిల్లా సగానికి సగమై చిన్నబోతుందని అంటున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో విజయనగరం గజపతినగరం, నెల్లిమర్ల, బొబ్బిలి, చీపురుపల్లి ఎస్ కోట ఉన్నాయి. ఇందులో నుంచి ఎస్ కోట విశాఖ జిల్లాకు వెళ్ళిపోతే మాత్రం అతి చిన్న జిల్లాగా మారిపోతుంది. ఇక విజయాంగరం జిల్లా అభివృద్ధి అంతా నెల్లిమర్ల ఎస్ కోట నియోజకవర్గాల మీదనే ఆధారపడి ఉంది. అందులో ఎస్ కోట కనుక విశాఖకు షిఫ్ట్ అయితే విజయాంగరం అభివృద్ధి కోసం భూముల సేకరణ కూడా సమస్యగా మారుతుందని అంటున్నారు. అయితే ఎస్ కోట వాసులతో పాటు ప్రజా ప్రతినిధులు అంతా విశాఖలో విలీనం మీదనే మొగ్గు చూపిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.