Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్‌ కు పారిపోయాడు... రష్యా పైలట్ కథ ఇలా ముగిసింది!

రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం భారీ ఎత్తున ఎడతెరపికి లేకుండా జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Feb 2024 10:32 AM GMT
ఉక్రెయిన్‌  కు పారిపోయాడు... రష్యా పైలట్  కథ ఇలా ముగిసింది!
X

రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం భారీ ఎత్తున ఎడతెరపికి లేకుండా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్యా నుంచి ఒక పైలట్ హెలికాప్టర్‌ తో సహా ఉక్రెయిన్‌ కు పారిపోయాడు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది. అయితే తాజాగా ఆ పైలెట్ స్పెయిన్‌ లో హత్యకు గురయ్యాడు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ రంగ మీడియా వెల్లడించింది.

అవును... హెలీకాప్టర్ తో సహా రష్యా నుంచి ఉక్రెయిన్ పారిపోయిన ఒక పైలెట్ మృతదేహాన్ని ఫిబ్రవరి 13న దక్షిణ స్పెయిన్‌ లోని విల్లాజాయిసా వద్ద గుర్తించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ క్రమంలో ఆ మృతదేహం రష్యా పైలట్‌ మ్యాక్సిమ్‌ కుజ్‌ మినోవ్‌ దిగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అతడు 2023 ఆగస్టులో ఎంఐ-8 హెలికాప్టర్‌ తో సహా పారిపోయాడు.

ఆ తర్వాత ఉక్రెయిన్‌ పాస్‌ పోర్టు లభించడంతో స్పెయిన్‌ వెళ్లి జీవిస్తున్నాడు. దీంతో ఈ విషయాన్ని రష్యా తమకు జరిగిన తీవ్ర అవమానంగా భావించింది. ఇంతలో ఏమి జరిగిందో కానీ... మ్యాక్సిమ్‌ పై గత వారం కాల్పులు జరిగాయి. ఒక వాహనంలో వచ్చిన ఇద్దరు దుండగులు అతడిపై దాడి చేశారు. దీంతో ఆ కాల్పుల్లో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

ఈ సమయంలో మృతుడు ఫేక్ ఐడెంటిటీ పత్రాలతో దేశంలో నివసిస్తున్నట్లు వెల్లడించారు. అయితే... మరణించిన వ్యక్తి రష్యా పైలట్‌ మ్యాక్సిమ్‌ అని ఉక్రెయిన్‌ నిఘా సంస్థ జీయూఆర్‌ అధికారులు వెల్లడించారు. దీంతో... .ఆ పైలట్ కథ అలా సుఖాంతమైందని అంటున్నారు.

కాగా... దేశాన్ని మోసం చేసి ఇతర దేశాల్లో స్థిరపడిన రష్యా సైనికులు, గూఢచారులపై గతంలోనూ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 2018లో రష్యా గూఢచారి సెర్గీ స్కిర్పాల్‌, అతడి కుమార్తెపై విష పదార్థంతో దాడి జరిగింది. అతడు రష్యా నుంచి పారిపోయి యూకేలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకొంది.