Begin typing your search above and press return to search.

రష్యా మహిళను ఉంచిన కేంద్రం వద్ద ఆమె ప్రియుడి హడావుడి

తాను ఇజ్రాయెల్ నుంచి వచ్చానని..నీనాను.. ఆమె పిల్లల కోసం బోలెడు బహుమతులు.. బట్టలు తెచ్చినట్లుగా చెప్పారు. అయినప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వలేదు.

By:  Tupaki Desk   |   19 July 2025 10:04 AM IST
రష్యా మహిళను ఉంచిన కేంద్రం వద్ద ఆమె ప్రియుడి హడావుడి
X

కర్ణాటకలోని గోకర్ణ పరిధిలోని రామతీర్థ అటవీ విభాగంలో ఒక గుహలో రహస్యంగా జీవిస్తున్న రష్యన్ మహిళ.. ఆమె పిల్లలు బయటపడటం.. తీవ్ర సంచలానికి గురి చేసింది. కనీస సౌకర్యాలు లేని గుహలో ఇద్దరు పిల్లలతో ఆమె ఎలా ఉండగలిగింది? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఆమెను రెస్క్యూ చేసిన పోలీసులు రష్యన్ మహిళను.. ఆమె ఇద్దరు పిల్లల్ని తమకూరు సమీపంలోని గో సంరక్షణ కేంద్రంలో వారిని ఉంచారు.

రష్యా మహిళ (నీనా కుటినా)తో సహజీవనం చేసిన ఆమె ప్రియుడు డ్రోన్ గోల్డ్ స్టెనిన్ సంరక్షణ కేంద్రం వద్దకు వచ్చారు. తన ప్రియురాలిని.. తన ఇద్దరు పిల్లల్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే.. అందుకు ఉన్నతాధికారుల అనుమతి ఇవ్వలేదు. దీంతో.. ఆమెను కలిసేందుకు హడావుడి చేశారు.

తాను ఇజ్రాయెల్ నుంచి వచ్చానని..నీనాను.. ఆమె పిల్లల కోసం బోలెడు బహుమతులు.. బట్టలు తెచ్చినట్లుగా చెప్పారు. అయినప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో.. వారున్న భవనంలోని కిటికీ నుంచి ఆమెతో సైగలతో డ్రోర్ పలుకరించటం గమనార్హం. ఈ సందర్భంగా నీనాతో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు.

ఆమెతో తాను తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తున్నానని.. నీనాతో పాటు పిల్లలతో దిగిన పలు ఫోటోలు తన వద్ద ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల్ని చదివించేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. ఉన్నతాధికారుల్ని సంప్రదించి.. నీనాను.. ఇద్దరు పిల్లల్ని తాను కలుస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్ సంరక్షణ కేంద్రం అధికారులకు కొత్త టెన్షన్ కు గురి చేసింది. నీనా ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.