పాక్.. రష్యా.. కూ.. చుక్ చుక్.. 2 దేశాల మధ్య భారీ రైల్వే రూట్
ఇక రష్యా మొదటినుంచి భారత దేశానికి అత్యంత సన్నిహిత దేశం. ప్రపంచ వేదికలపై ఇరు దేశాలు పరస్పరం సహకరించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.
By: Tupaki Desk | 6 July 2025 9:47 AM ISTఎవరైనా ఇద్దరు వ్యక్తులు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఉంటే చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని అంటారు. ఇప్పుడు రెండు దేశాలు మాత్రం కూ చుక్ చుక్ అని అంటున్నాయి. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న అత్యంత అనిశ్చిత పరిస్థితుల మధ్య.. ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియని సందర్భంలో పాకిస్థాన్-రష్యా చేతులు కలిపాయి.
ఉక్రెయిన్ పై మూడున్నరేళ్లుగా యుద్ధం చేస్తూ ఎంతకూ గెలవలేకపోతున్న రష్యా.. ఇప్పుడు పాకిస్థాన్ తో ఓ వివాదాస్పద ప్రాజెక్టు చేపట్టనున్నట్లు కథనాలు వస్తున్నాయి. అదేమంటే.. పాక్ ను కలిపేలా మధ్య ఆసియా దేశాల మీదుగా రైలు, రోడ్ నెట్ వర్క్ నిర్మణానికి రష్యా అంగీకారం తెలిపింది. దీనిపై ఒప్పందం కూడా చేసుకున్నాయి. ఇది తమ దేశానికి వ్యూహ్మాత్మక అంతర్జాతీయ కూడలి అవుతుందని పాక్ సంబరపడుతోంది. అసలే దరిద్రంలో ఉన్న ఆ దేశానికి రష్యా ఏం చూసి ఒప్పందం చేసుకున్నదో..?
ఇక రష్యా మొదటినుంచి భారత దేశానికి అత్యంత సన్నిహిత దేశం. ప్రపంచ వేదికలపై ఇరు దేశాలు పరస్పరం సహకరించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అదే పాకిస్థాన్ తో రష్యాకు పెద్దగా సంబంధాలు లేవు. అంతెందుకు..? 2022లో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగిన సందర్భంలో ఆ దేశాన్ని సందర్శించారు అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆ తర్వాత అమెరికా కోపానికి గురై కొన్ని నెలలకే పదవి పోగొట్టుకునారు.
అలాంటిది ఇప్పుడు రష్యా-పాక్ మధ్య రైల్ నెట్ వర్క్ అంటే విచిత్రమే. మరోవైపు మధ్య ఆసియా దేశాల్లో చాలావరకు ముస్లిం ప్రాబల్యం ఉన్నవే. రష్యాకు కూడా పాక్ తో కనెక్టివిటీ అవసరం ఉంది. అందుకేనేమో వివాదం వస్తుందని తెలిసినా ఒప్పుకొంది. మరి దీనిని అమెరికా ఎలా సహిస్తుందో..?
పాకిస్థాన్ ఇప్పటికే చైనాతో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టు చేపట్టింది. భారత్ కు వ్యతిరేకంగా చైనా సాయం పొందుతోంది. ఇప్పుడు రష్యాతోనూ గట్టి బంధం ఏర్పర్చుకుంటోంది. భారత్.. బహుపరాక్.
