బిగ్ అప్ డేట్... ఎస్-500పై భారత్ కు రష్యా కీలక ప్రతిపాదన!
ఈ సమయంలో దాని అప్ డేటెడ్ వెర్షన్ ఎస్-500 గురించిన ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 13 May 2025 9:32 AM ISTఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 6-7 రాత్రి పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ లో పాకిస్థాన్ లో 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 5 ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయడంతోపాటు.. 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
దీంతో.. ఉగ్రవాదులను భారత్ మట్టుబెట్టేసరికి పాకిస్థాన్ ప్రతీకారంతో రగిలిపోయింది. దీంతో.. మే 7-8 తెల్లవారుజామున జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ మీదుగా భారతదేశ ఆకాశం యుద్ధభూమిగా మారిపోయింది. ఆపరేషన్ సిందూకు ప్రతీకారంగా శ్రీనగర్, అమృత్ సర్, పఠాన్ కోట్ సహా 15 నగరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిపోయింది.
అయితే... సుదర్శన్ చక్ర అని పిలవబడే రష్యాలో తయారుచేయబడిన ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థతో ఆ బెదిరింపులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వీర్యం చేసింది. సైనిక, పౌర మౌలిక సదుపాయాలకు ఎటువంటి నష్టం జరగకుండా నిరోధించింది. దీంతో.. ఎస్-400 గురించిన చర్చ విపరీతంగా జరిగింది. ఈ సమయంలో ఎస్-500 అంశం తెరపైకి వచ్చింది.
అవును... భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. పాకిస్థాన్ ప్రయోగించిన వందల డ్రోన్లు, క్షిపణులను ఎస్-400 గాల్లోనే నిర్వీర్యం చేసింది. దీంతో.. ఈ భారత గగనతల రక్షణ వ్యవస్థలోని సుదర్శన్ చక్రం గురించి తీవ్ర చర్చ జరిగింది. ఈ సమయంలో దాని అప్ డేటెడ్ వెర్షన్ ఎస్-500 గురించిన ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం ఎస్-400 భారత గగనతల వ్యవస్థను పటిష్టం చేసినప్పటికీ.. రష్యా నెక్స్ట్ ప్లాన్ ఎస్-500.. సరిహద్దులను మరింత సేఫ్ గా ఉంచుతుంది, ఆ దిశగా ముందుకు వెళ్లడనికి సిద్ధంగా ఉందని అంటున్నారు. వాస్తవానికి రష్యన్ సేవల కోసం 2021లో ఎస్-500.. హైపర్ సోనిక్ క్షిపణులు, స్టెల్త్ విమానాలు వంటి ముప్పులను ఎదుర్కోవడానికి రూపొందించబడింది.
ఈ క్రమంలో... భారత్ తో కలిసి అత్యుత్తమ ఎస్-500 వ్యవస్థను ఉమ్మడిగా ఉత్పత్తి చేయడానికి రష్యా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇది బాలిస్టిక్ క్షిపణులను, హైపర్ సోనిక్ ఆయుధాలను కూడా నాశనం చేయడానికి రూపొందించబడుతుందని అంటున్నారు. ఇది భారత గగనతల రక్షణ వ్యవస్థను మరిందని దుర్భేద్యమైందిగా మారుస్తుందని నమ్ముతున్నారు.
ఇక ఈ వ్యవస్థ రాడార్.. అధునాతన యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండ్ అర్రే... దాదాపు 2,000 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాలను గుర్తించగలదని అంటున్నారు. దీంతో... ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.
