వావ్....పుతిన్ కోసం ప్రధాని ప్రొటోకాల్ పక్కన పెట్టేశారు....
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ గడ్డపై అడుగుపెట్టిన వెంటనే...పోలం ఎయిర్ పోర్టులో ప్రధాని నరేంద్ర మోదీ ఎదురెళ్ళి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
By: Tupaki Desk | 4 Dec 2025 11:32 PM ISTరష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ గడ్డపై అడుగుపెట్టిన వెంటనే...పోలం ఎయిర్ పోర్టులో ప్రధాని నరేంద్ర మోదీ ఎదురెళ్ళి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. పుతిన్ కూడా సంతోషంగా షేక్ హ్యాండ్ ఇచ్చారు...ఈ దృశ్యం ఇపుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. విదేశీ అతిథులు మనదేశానికి వచ్చినపుడు వారి స్థాయుల్ని అనుసరించి కచ్చితమైన గౌరవ మర్యాదలు కల్పించాల్సి ఉంటుంది. దీన్నే ప్రోటోకాల్ అంటారు. చివరికి వారికి ఇచ్చే షేక్ హ్యాండ్ లో చేతులు ఊపే సంఖ్య కూడా కౌంట్ అవుతుంది. అలాంటిది రష్యాఅధ్యక్షుడు పుతిన్ వచ్చిన వేళ స్నేహితుణ్ని చూసి సంబరపడిపోయినట్లు ప్రధాని నేరుగా వెళ్ళి ఆలింగనం చేసుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అత్యంత కట్టుదిట్టమైన సైనిక కవచం పుతిన్ దిగగానే అప్రమత్తంగా ఉంటుంది. కానీ ప్రధాని నరేంద్ర పుతిన్ ను కౌగలించుకున్న సమయంలో ప్రొటోకాల్ కంటే ప్రేమాభిమానాలకే పెద్దపీట వేసినట్లయ్యింది.
సాధారణంగా విదేశీ అధ్యక్షులు దేశాన్ని సందర్శించినపుడు...పాటించాల్సి ప్రోటోకాల్ లో చాలా అంశాలే ఇమిడి ఉంటాయి. సైనిక కవాతు, గౌరవ వందనం స్వీకరించడం, ఇరుదేశాల జాతీయ గీతాలు ఆలపించడం, పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి ఉంటాయి అత్యున్నత హోదా ఉన్న అధికారి..లేదా నేత హోస్ట్ గా వెళ్ళి అతిథికి స్వాగతం పలకాలి. ఆ తర్వాత మిలటరీ వారిచే బ్యాండ్ వాదన ఉంటుంది. తొలుత వచ్చిన గెస్ట్ దేశ జాతీయ గీతం వాద్యాలపై ఆలపించాలి. ఆ తర్వాత హోస్ట్ దేశపు జాతీయ గీతం ఆలపించాలి. గౌరవపూర్వకంగా తుపాకులు గాల్లో పేల్చాలి. అతిథి సైనికులచే గౌరవ వందనం స్వీకరించాలి. ఇవన్నీ తతంగాలు తుచ తప్పకుండా ఆచరించాలి. అయితే రష్యా భారత్ విషయంలో ప్రోటోకాల్ కన్నా ఫ్రెండ్ షిప్ కే అధ్యక్షుడు , ప్రధాని పెద్దపీట వేశారని నరేంద్రమోదీ పుతిన్ ను కౌగలించుకున్న క్షణంలో ప్రపంచానికి అర్థమైంది.
ఇండియాకు అమెరికా కన్నా రష్యాతోనే మైత్రీ బంధం చాలా గట్టిగా ఉంది. అమెరికాతో స్నేహం కన్నా వాణిజ్య ఒప్పందాలే అధికం. అమెరికా ఇండియాతో ఏ విధమైన స్నేహం ప్రదర్శించినా...అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారి అవసరాలతోనో, ప్రయోజనాలతోనో ముడివడి ఉంటాయి. అందుకే అమెరికా ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. అదే రష్యా విషయంలో అలాకాదు...ఇరు దేశాలు చాలా స్నేహపూర్వకంగా ఉంటుది. ఇరు దేశాలు దౌత్యపరంగా చాలా మెచ్చూర్డ్ గా వ్యవహరిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోదీ పుతిన్ ను చూడగానే ప్రేమోద్వేగంతో ఆలింగనం చేశారని అనిపించింది.
