Begin typing your search above and press return to search.

ప్రీ వెడ్డింగ్ షూట్ @ ఆర్టీసీ బస్... వీడియో వైరల్!

ఈ షూట్ లో భాగంగా యువతి బస్సులో నుంచి దిగుతున్నట్లుగా.. అబ్బాయి వెనుక నుంచి వస్తున్నట్లుగా వీడియో ఉంది.

By:  Tupaki Desk   |   10 Jan 2024 9:02 AM GMT
ప్రీ వెడ్డింగ్  షూట్ @ ఆర్టీసీ బస్... వీడియో వైరల్!
X

ఒకప్పుడు... పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు. తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ. మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు! ఇప్పుడు మాత్రం... "అవన్నీ తర్వాత ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ కానియ్యి" అని అంటున్నాయి కాబోయే జంటలు! ప్రస్తుతం ఎటు చూసినా ఈ ట్రెండే కొనసాగుతుంది! ఈ సందర్భంగా కొంతమంది చేస్తున్న వింతపోకడలే చికాకు పెట్టిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ క్రమంలో తాజాగా ఓ కాబోయే జంట ఈ షూట్ కోసం ఆర్టీసీ బస్సెక్కింది!

అవును... ఇటీవల కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్లంటూ కొన్ని కాబోయే జంటలు వింత పోకడలకు పోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర విచిత్ర విన్యాశాలలో భాగంగా గతంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోగా.. మరికొందరైతే ప్రజలకు ఇబ్బందులు కలిగించి చిక్కులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ జరిగేవి జరుగుతూనే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కాబోయే ఓ జంట ఏకంగా నడిరోడ్డుపై ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

వాహనాలు రద్దీగా ఉన్న సమయంలో హైదరాబాద్‌ నగరంలో ఓ జంట ఏకంగా ఆర్టీసీ బస్సులో ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకుంది! ట్రాఫిక్‌ లో ఓ బస్సు ఆగి ఉన్న సమయంలో ఆ జంట తమ షూట్ కోసం ఆర్టీసి బస్సును వాడుకుంది! ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది. ఈ షూట్ లో భాగంగా యువతి బస్సులో నుంచి దిగుతున్నట్లుగా.. అబ్బాయి వెనుక నుంచి వస్తున్నట్లుగా వీడియో ఉంది. అనంతరం రోడ్డు, ఫుట్‌ పాత్‌ పై కూడా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు.

దీంతో ఈ వ్యవహారంపై పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. టీఎస్ ఆర్టీసీని ట్యాగ్ చేసి మరీ రియాక్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ఉన్న ఇటువంటి చర్యలను కట్టడి చేయాలని కోరుతున్నారు. మరికోంతమంది మాత్రం “బాగుంది బాగుంది” అని కామెంట్ చేస్తున్నారు!