Begin typing your search above and press return to search.

ఫేక్ వీడియోలతో శునకానందం... టీడీపీ, వైసీపీ రెబల్స్‌ పై రోజా ఫైర్‌!

అవును... ఈ సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు అన్ని ప్రధాన పార్టీల్లోనూ కొన్ని కీలక స్థానాల్లో రెబల్స్ తో ఇబ్బందులు ఎక్కువగానే ఉన్నాయని అంటున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 May 2024 10:53 AM GMT
ఫేక్  వీడియోలతో శునకానందం... టీడీపీ, వైసీపీ రెబల్స్‌  పై రోజా ఫైర్‌!
X

ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు హోరెత్తిపోతున్న సంగతి తెలిసిందే. ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం రంజుగా మారిందనే కామెంట్లను సొంతం చేసుకుంటుంది. ఈ సమయంలో వైసీపీలో రెబల్స్ బెడతను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని చెబుతున్న మంత్రి ఆర్కే రోజా.. ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. అవిరామంగా ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ సందర్భంగా నగరి లోని రెబల్స్ పై ఫైర్ అయ్యారు!

అవును... ఈ సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు అన్ని ప్రధాన పార్టీల్లోనూ కొన్ని కీలక స్థానాల్లో రెబల్స్ తో ఇబ్బందులు ఎక్కువగానే ఉన్నాయని అంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆ పార్టీ, ఈ పార్టీ అనే తారతమ్యాలు లేవనేవారే ఎక్కువ! ఈ సమయంలో నగరిలో రెబల్స్‌ మంత్రి రోజాకు తలనొప్పిగా మారారు. దీంతో... వారిపై ఆమె ఫైరయ్యారు.

ఇందులో భాగంగా... రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ని ఓడించడానికి అందరూ ఏకమయ్యారని మొదలుపెట్టిన రోజా.. ఎంతమంది ఒక్కటైనా పందులు పందులే.. సింహం సింహమే అని అన్నారు. అయితే... "జగనన్న బాగుంటేనే మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి" అనే విషయం అంతా గుర్తుపెట్టుకోవాలని ఆమె సూచించారు. ఇదే సమయంలో నగరి వైసీపీలోని తన వ్యతిరేక వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే... నగిరి నియోజకవర్గంలో నిన్నటివరకూ అన్ని పదవులు అనుభవించి, క్వారీల్లో అక్రమంగా సంపాదించుకొని.. తనను వెన్నుపోటు పొడిచారని మంత్రి రోజా ఆరోపించారు. ఈ సమయంలోనే... తనను ఓడించడానికి అంతా ఏకమై, నగరి టీడీపీ అభ్యర్ది గాలి భాను ప్రకాష్ ను గెలిపించడానికి తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా... ప్రజలు వెన్నుపోటు దారులకు బుద్ధి చెప్పాలని.. నియోజకవర్గ ప్రజలకు గతంలో ఎన్నడూ లేనివిధంగా మంచి చేసిన తనను గెలిపించాలని మంత్రి ఆర్కే రోజా నగరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంతకాలం పార్టీలో ఉండి.. అన్నివిధాలా పదవులు అనుభవించి, డబ్బులు సంపాదించుకుని.. ఎన్నికలు వచ్చేసరికి ప్లేట్లు ఫిరాయించినవారికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు!

మరోవైపు... ఒక మహిళా ఎమ్మెల్యే, మంత్రి అని చూడకుండా టీడీపీ వాళ్లు తాను ఓటుకు నోటు ఇస్తానన్నట్లుగా ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి శునకానందం పొందుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు. గతంలో తనకు టిక్కెట్ రాదని, రెబల్స్ వల్ల ఓడిపోతున్నట్లు తప్పుడు ప్రచారాలు చేసి, అవి ఫెయిల్ అవ్వడంతో.. ఇప్పుడు ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు!

కాగా.. నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి రోజా ఓ వైపు, ఆమె భర్త ఇంకోవైపు, వైసీపీ నేతలు మరోవైపు తిరుగుతూ ఆమె కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు! దీంతో... మరోసారి విజయం సాధించి, తన వ్యతిరేక వర్గానికి చెక్‌ పెడతాననే నమ్మకంతో ఆర్కే రోజా ఉన్నారని తెలుస్తుంది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన రోజా... మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు!