'అపానవాయువు'... రోజా అంత మాట అనేశారేంటి?
వైసీపీ నేతల్లో కొంతమంది ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ టార్గెట్ గా కీలక విమర్శలు చేస్తారనే సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 July 2025 2:21 PM ISTవైసీపీ నేతల్లో కొంతమంది ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ టార్గెట్ గా కీలక విమర్శలు చేస్తారనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు మొదలైన నేతలు పవన్ సినిమాలపైనా, రాజకీయాలపైనా, వ్యక్తిగత జీవితంపైనా సెటైర్లు వేస్తుంటారు! అయితే... అవన్నీ ఒకెత్తు అయితే ఆర్కే రోజా విమర్శలు మరొకెత్తు అంటారు. ఈ క్రమంలో ఓ ‘పెద్ద’ మాట అనేశారు రోజా!
అవును... తాజాగా 'హరిహర వీరమల్లు' సినిమా ప్రమోషన్ లో భాగంగా స్పందించిన పవన్ కళ్యాణ్.. తనను తాను 'పవనం' అనీ, తాను అంతటా ఉంటాను అని అన్నారు. అంటే.. తాను కూడా గాలి లాంటి వాడిని, అన్ని చోట్లా ఉంటాను అన్న ఉద్దేశ్యంతో మాట్లాడారు! దీంతో... పవన్ ఈ వ్యాఖ్యల వెనుక రోజా విమర్శల ప్రభావం బలంగా ఉందని అంటున్నారు.
ఇటీవల మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ ఏ ఊరు వెళ్తే, ఆ ఊరిలోనే తాను పుట్టానని, తాను చిన్నప్పుడు అక్కడే పెరిగానని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు! ఇదే క్రమంలో... మొన్నటికి మొన్న తమిళనాడు వెళ్లినా తాను అక్కడే పరిగానని పవన్ చెప్పారని చెప్పిన రోజా.. ఆయనకు పిచ్చి బాగా ముదిరిందని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గానే అన్నారో ఏమో కానీ... తాజాగా ఈ విషయాన్ని పవన్ ప్రస్థావిస్తూ... "చాలామంది ఈ పవన్ కళ్యాణ్ ఏంటి ఎక్కడికి వెళ్ళినా, నేను ఇక్కడ ఉండేవాడిని అని అంటాడు అని అనుకుంటారు. నా పేరు పవనం... నేను తిరుగుతూ ఉంటాను... మనం పవనాలు... అవి బావిలో కప్పలు" అని అన్నారు. దీంతో.. ఇది రోజాకు కౌంటర్ అనే కామెంట్లు వినిపించాయి!
అంటే... రోజా, వైసీపీ నేతలను ఉద్దేశించి.. వారిని నూతిలో కప్పలు అని పవన్ అన్నారనే ప్రచారం జరిగింది! ఈ నేపథ్యంలో... రోజా ఎక్స్ అకౌంట్ లో ఓ ట్వీట్ దర్శనమిచ్చింది. ఇందులో భాగంగా... "అపానవాయువు అంతటా ఉంటుంది కానీ ఏమి లాభం?" అని రాశారు రోజా! దీంతో.. ఈ ట్వీట్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.
దీంతో... ఈ ట్వీట్ పవన్ కల్యాణ్ కామెంట్లకు కౌంటర్ గానే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి! కాగా... అపానవాయువు అంటే... కడుపులో ఏర్పడిన గ్యాస్ లేదా గాలిని బయటకు పంపడం అని అర్ధం!! దీంతో... రోజా అంతమాట అనేశారేంటి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
