Begin typing your search above and press return to search.

గర్ల ఫ్రెండ్స్ ఉన్న బౌలర్ల రిక్వస్ట్... రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ షోలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఇదే సమయంలో రోహిత్ శర్మ భార్య ప్రేక్షకుల్లో కూర్చున్నారు!

By:  Tupaki Desk   |   8 April 2024 11:22 AM GMT
గర్ల  ఫ్రెండ్స్  ఉన్న బౌలర్ల రిక్వస్ట్... రోహిత్  శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
X

ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. రోజూ ఈ మ్యాచ్ లు సృష్టిస్తోన్న సందడి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో... రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ లు అతిథులుగా వచ్చిన "ది గ్రేట్ ఇండియన్" కపిల్ షో ఎపిసోడ్ విడుదలైంది! ఈ షోలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఇదే సమయంలో రోహిత్ శర్మ భార్య ప్రేక్షకుల్లో కూర్చున్నారు!

ఈ సందర్భంగా... ఎప్పుడైనా తమ గర్ల్‌ ఫ్రెండ్స్ స్టాండ్‌ లో ఉన్నప్పుడు వారి బౌలింగ్‌ లో తక్కువ సిక్స్ లు కొట్టమని ఎవరైనా అడిగారా అని రోహిత్ శర్మను కపిల్ శర్మ అడిగారు. ఈ నేపథ్యంలో... రోహిత్ "అవునని" సమాధానం ఇస్తూ.. ఆసక్తికరంగా స్పందించారు. ఇందులో భాగంగా... అలాంటి వినతులు వస్తున్నప్పుడు వాటిని తాను సున్నితంగా తిరస్కరిస్తానని చెప్పాడు!

ఆ సమయంలో వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్ గ్రౌండ్ లోకి వచ్చినట్లే.. తన భార్య కూడా వస్తుందని.. మ్యాచ్ ను టెన్షన్ టెన్షన్ గా చూస్తూ ఉంటుందని.. ఆమె తనకు చాలా ముఖ్యమని రోహిత్ క్లారిటీ ఇచ్చాడు.

ఈ సమయంలో కపిల్ నెక్స్ట్ క్వశ్చన్ రోహిత్ భార్య రితిక వైపు మళ్లింది. ప్రస్తుతం ఆమె రోహిత్ శర్మకు మేనేజర్ గా ఉంది! దీంతో... రోహిత్ ను క్రికెటర్ గా హ్యాండిల్ చేయడం కష్టమా, భర్తగా హ్యాండిల్ చేయడం కష్టమా అన్నట్లుగా ప్రశ్నించారు. దీంతో... భర్తగానే అని ఆమె చెప్పడంతో.. ఒక్కసారిగా అంతా నవ్వులు విరిసాయి!

ఇక తాను మైదానంలో కెప్టెన్ గా ఉన్నా... ఇంట్లో మాత్రం ఆమె కెప్టెన్ అంటూ రోహిత్ నవ్వుతూ చెప్పాడు. ఇందులో భాగంగా... ఆమె క్రికెట్ ఫీల్డ్ లోకి రాలేదు.. డ్రెస్సింగ్ రూం కి కూడా రాలేదు.. కానీ నేను ఇంట్లోకి ప్రవేశించాలి.. అక్కడ మాత్రం ఆమె కెప్టెన్ అని అన్నాడు.