Begin typing your search above and press return to search.

రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత తాజా ట్వీట్ చూశారా?

ప్రపంచంలో అత్యంత విలువైన పుస్తకాల్లో ఒకటైన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఈ మధ్యన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం తెలిసిందే.

By:  Garuda Media   |   18 Feb 2026 10:22 AM IST
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత తాజా ట్వీట్ చూశారా?
X

ప్రపంచంలో అత్యంత విలువైన పుస్తకాల్లో ఒకటైన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఈ మధ్యన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం తెలిసిందే. ఇన్వెస్టర్ గా.. మనీ మేనేజ్ మెంట్ గురుగా పేరున్న ఆయన.. ఆ మధ్యన బంగారం.. వెండి ధరలు భారీగా పెరుగుతాయని.. వాటిని తక్కువ ధరల్లో కొనటం తెలివైన నిర్ణయంగా పేర్కొనటమే కాదు.. తాను ఎంతెంత బంగారాన్ని కొన్న విషయాన్ని ఆయన సోషల్ పోస్టుల ద్వారా వెల్లడించటం తెలిసిందే. ఆయన అంచనాలకు తగ్గట్లే వెండి.. బంగారం ధరలు అనూహ్యంగా పెరగటం తెలిసిందే.

ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పట్టినా.. కియోసాకి చెప్పిన సమయంలోనే బంగారాన్ని.. వెండిని కొన్నోళ్లు.. ఆ తర్వాత రోజుల్లో అమ్మేసి భారీగా లాభాల్ని సొంతం చేసుకున్న వారికి కొదవలేదు. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. తన తాజా పోస్టులో మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. తాను గతంలోనే వార్నింగ్ ఇచ్చినట్లుగా భారీ ఎత్తున క్రాష్ మొదలైనట్లుగా చెబుతున్నారు. తాను వార్నింగ్ ఇచ్చినట్లే.. ఫ్యూచర్ లో అతి పెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్ జరుగుతుందని.. అందుకు తగ్గట్లు ప్రిపేర్ గా ఉండాలన్నారు.

2013లో తాను రాసిన రిచ్ డాడ్స్ పుస్తకంలో భవిష్యత్తులో అతి పెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్ జరుగుతుందని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను చెప్పినట్లు.. పెద్ద ఆర్తిక సంక్షోభం సమీపంలో ఉందని.. మార్కెట్ క్రాష్ కొందరికి డేంజర్ అయినా.. స్టాక్స్ కొనుగోలు చేసే వారికి మాత్రం అదో గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. బిట్ కాయిన్ విలువ బాగా తగ్గినప్పుడు తాను మరింత కొనుగోలు చేస్తారని చెప్పిన ఆయన.. ‘బిట్ కాయిన్ విలువ తగ్గిన తర్వాతే తాను కొంటానని చెప్పటం గమనార్హం. తన వరకు బంగారం.. వెండి.. బిట్ కాయిన్.. ఎథెరియం నిజమైన ఆస్తులుగా ఆయన పేర్కొన్నారు.

ఆర్థిక సంక్షోబాలు ఎప్పుడూ కూడా నష్టాల్నే కాదు.. అవకాశాల్ని కూడా కల్పిస్తాయని చెప్పిన కియోసాకి మాట అక్షర సత్యంగా చెప్పేటోళ్లు కూడా కనిపిస్తారు. ఒక కంపెనీకి అధినేతగా ఉంటూ.. అందరూ ఆర్థికంగా మరింత ఉన్నత స్థానాలకు వెళ్లాలన్న భావనను ఆయన తన పోస్టులతో వ్యక్తం చేస్తుతుంటారని చెప్పొక తప్పదు. ఇంకెందుకు ఆలస్యం..?