వాట్ నెక్ట్స్ .. రోజాకు పెద్ద ఇబ్బందే.. !
కానీ, ఇప్పుడు అంతా రివర్స్ అయింది. ఆమెకు అండగా ఉంటున్నవారు కూడా.. ఇప్పుడు టీడీపీ చెంతకు చేరిపోయారు.
By: Garuda Media | 10 Jun 2026 11:00 PM ISTవైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఇబ్బందులు చుట్టుముట్టాయి. తన సొంత నియోజకవర్గం నగరిలో ఆమె గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 2014, 2019లో విజయం దక్కించు కున్న ఆమె.. మంత్రి అయ్యారు. ఆ తర్వాత.. నియోజకవర్గంలో సొంతిల్లు కట్టుకుని.. టీడీపీ కార్యకర్తలను కూడా బలవంతంగా(విమర్శ ఉంది) వైసీపీలోకి చేర్చుకున్నారు. కానీ.. ఎంత చేసినా.. కూటమి హవా ముందు.. గత ఎన్నికల సమయంలో రోజా నిలబడలేక పోయారు.
టీడీపీ యువ నాయకుడు, గాలి భాను ప్రకాష్ విజయం దక్కించుకున్నారు. సరే.. గెలుపు-ఓటములను లైట్ తీసుకుంటానని చెబుతున్న రోజా.. నిజంగానే ఓడిపోయినా.. నియోజకవర్గంలో మాత్రం తరచుగా పర్యటిస్తున్నారు. ఈ విషయంలో ఇతర నేతల కంటే కూడా.. రోజా నాలుగు ఆకులు ఎక్కువగానే చదివారు. అయితే.. ఎటొచ్చీ.. ఇప్పుడు ఆమెకు ఎదురవుతున్న సమస్య కేడర్. గతంలో తాను నయానో భయానో.. పార్టీలో కేడర్‌ను పెంచుకున్నారు. మండలాల వారీగా టైం చెప్పి మరీ.. ఆమె కార్యకర్తలను చేర్చుకున్నారు.
కానీ, ఇప్పుడు అంతా రివర్స్ అయింది. ఆమెకు అండగా ఉంటున్నవారు కూడా.. ఇప్పుడు టీడీపీ చెంతకు చేరిపోయారు. గతంలో మాదిరిగా తాము బలవంతం చేస్తే.. టీడీపీలోకి రాలేదని వారు స్టేట్మెంట్లు ఇవ్వడం గమనార్హం. అంతేకాదు.. ఎమ్మెల్యే పనితీరును కూడా వారు మెచ్చుకుంటున్నారు. ఈ పరిణామాలే.. రోజా కు వాట్ నెక్ట్స్ అనే ప్రశ్న తెరమీదకు వచ్చేలా చేస్తున్నాయి. ఇలా తనను వీడిపోతున్నవారిలో హార్డ్ కోర్ అనుకున్న అభిమానులు కూడా ఉన్నారు. దీంతో రోజా ఇటీవల పర్యటించినప్పుడు.. పట్టుమని పది మంది కూడా కనిపించలేదు.
ఎందుకిలా.. ?
నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాను.. డాబు దర్పాలకు దూరంగా ఉంటున్నారు. కార్యకర్తలకు అందుబాటు లో ఉంటున్నారు. ఎవరు ఫోన్ చేసినా.. ఆయనే స్వయంగా మాట్లాడుతున్నారు. ప్రజల మధ్య నిరంతరం తిరుగుతున్నారు. అదేసమయంలో పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమాన్ని కూడా లబ్ధిదారులైతే ఖచ్చితంగా అందేలా చూస్తున్నారు. దీంతో రోజా కంటే భాను మెరుగు అని భావిస్తున్న నాయకులు.. ఆయన వెంటే తిరుగుతున్నారు. పార్టీ మారిపోయారు. ఇది రోజాకు తీవ్రస్థాయిలో కలవరం రేపుతోంది. పైగా ఆమె బెంగళూరు, హైదరాబాద్‌కు పరిమితం కావడం కూడా కేడర్ కకావికలం అయిపోవడానికి కారణమని అంటున్నారు.
