Begin typing your search above and press return to search.

క్రికెట‌ర్ చాహ‌ల్‌తో డేటింగ్‌పై RJ మ‌హ‌వాష్ షాక్‌లు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జే మహవాష్ త‌న రిలేష‌న్ షిప్ స్టాట‌స్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉన్నాన‌ని పెళ్లి ఆలోచ‌న ఇప్ప‌ట్లో లేద‌ని కూడా అన్నారు.

By:  Tupaki Desk   |   4 April 2025 5:55 PM IST
క్రికెట‌ర్ చాహ‌ల్‌తో డేటింగ్‌పై RJ మ‌హ‌వాష్ షాక్‌లు
X

ఆర్జే మహ్వాష్ - యుజ్వేంద్ర చాహల్ మధ్య డేటింగ్ గురించి చాలా పుకార్లు షికార్ చేసాయి. క్రికెటర్ చాహ‌ల్ విడాకుల వార్త ఆన్‌లైన్‌లో చర్చ‌గా మారిన కొద్దిసేటికే ఈ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో చాహ‌ల్ మొదటిసారి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మ‌హ‌వాష్‌తో బహిరంగంగా కనిపించాడు. ర‌క‌ర‌కాల ఊహాగానాల న‌డుమ‌ మహ్వాష్ - యుజ్వేంద్ర చాహల్ ఇద్దరూ మొదట్లో ఎలాంటి కామెంట్లు చేయ‌కూడ‌దని నిర్ణయించుకున్నారు. అయితే ఆ ఇద్ద‌రూ క‌లిసి ఉన్న‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైర‌ల‌వ్వ‌డంతో చివరికి మహ్‌వాష్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త‌ప్పుడు ప్ర‌చార‌మిది అంటూ ఖండించే ప్ర‌య‌త్నం చేసారు.

ఆర్జే మ‌హ్వాష్ స్ట్రాంగ్ నోట్‌లో తప్పుడు కథనాలు ప్ర‌చురించే వారిని విమర్శించారు. ఆడా మ‌గా క‌లిసి ఉంటే ఇలా త‌ప్పుగా ఊహిస్తారా? అని ప్ర‌శ్నించింది. యుజ్వేంద్ర చాహల్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆర్జే స్పష్టంగా ఖండించారు. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఆర్జే మహవాష్ తో బహిరంగంగా కనిపించాక ఆ ఇద్ద‌రి ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. కానీ ఆర్జే మ‌హ్వాష్ తాజా వెర్ష‌న్ షాకిస్తోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జే మహవాష్ త‌న రిలేష‌న్ షిప్ స్టాట‌స్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉన్నాన‌ని పెళ్లి ఆలోచ‌న ఇప్ప‌ట్లో లేద‌ని కూడా అన్నారు. పెళ్లికి సిద్ధం అయ్యే యువ‌కుడితో మాత్ర‌మే తాను డేటింగ్ చేస్తాన‌ని కూడా అన్నారు. ఎందుకంటే మ‌హ్వాష్‌ సాధారణంగా ఇలాంటి సంబంధాలను నమ్మలేన‌ని దానికి త‌న జీవితంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను ఉద‌హ‌రించారు. జీవితంలో ఈ సమయంలో పెళ్లి అనే భావన చాలా సంక్లిష్ఠ‌మైన‌ద‌ని కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనను పక్కన పెట్టానని కూడా ఆమె అన్నారు.

అదే ఇంట‌ర్వ్యూలో ఆర్జే మహ్వాష్ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. తనకు 19 ఏళ్ల వయసులోనే నిశ్చితార్థం జరిగిందని వెల్లడించింది. అయితే పెళ్లి జ‌ర‌గ‌లేదు. రెండేళ్ల తర్వాత ఆ సంబంధం ముగిసింది. తాను అలీఘర్ అనే చిన్న పట్టణానికి చెందిన యువ‌తిన‌ని తెలిపిన మ‌హ్వాష్ స‌రైన‌ మనస్తత్వం ఉన్న వ్య‌క్తిని క‌ల‌వ‌లేక‌పోయాన‌ని తెలిపారు. పెళ్లితో సెటిల‌వ్వ‌డాన్ని జీవితంలో అంతిమ లక్ష్యంగా పరిగణించాల‌ని అన్నారు.