Begin typing your search above and press return to search.

ఇది విమానమా.. వింత లోకమా..ఆకాశంలోనూ రాజభోగమే!

ఇప్పుడు వాళ్ల ఎయిర్ లైన్స్ అయిన రియాద్ ఎయిర్ కూడా ఓ అదిరిపోయే లగ్జరీ విమానాన్ని తీసుకొచ్చింది ఈ విమానం లోపల డిజైన్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందంతే.

By:  Tupaki Desk   |   21 April 2025 8:30 AM
Riyadh Air Unveils Luxurious Boeing 787-9
X

సౌదీ అరేబియా వాసుల గురించి ప్రత్యేకంగా చేప్పేదేముంది.. లగ్జరీ జీవితానికి పెట్టి పుట్టినోళ్లు వాళ్లంతా. ఖరీదైన కార్లు, పెద్ద పెద్ద షిప్పులు అంటే వాళ్లకు అమితమైన ఇష్టం. ఇప్పుడు వాళ్ల ఎయిర్ లైన్స్ అయిన రియాద్ ఎయిర్ కూడా ఓ అదిరిపోయే లగ్జరీ విమానాన్ని తీసుకొచ్చింది ఈ విమానం లోపల డిజైన్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందంతే. బోయింగ్ 787-9 అనే ఈ విమానానికి సంబంధించిన వీడియో ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టగానే అందరూ "అబ్బా ఏమి ఉందిరా బాబూ" అంటూ నోరెళ్ల బెడుతున్నారు. అంతా మోడ్రన్ టెక్నాలజీతో పాటు లగ్జరీ హంగులతో విమానాన్ని నింపేశారు. ఈ ఏడాది ఆఖరుకల్లా మనం కూడా ఈ విమానంలో చక్కర్లు కొట్టొచ్చని సమాచారం. రియాద్ ఎయిర్‌లైన్స్‌కు ఇది ఓ పెద్ద మైలు రాయని నిపుణులు అంటుున్నారు.

రియాద్ ఎయిర్‌లైన్స్ వాళ్లు దీనిని మొదటి నుంచి డిజిటల్ ఎయిర్‌లైన్‌లా డిజైన్ చేశారు. ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా, టెక్నాలజీతో అన్నీ సెట్ చేశారు.. సౌకర్యాల్లో, కొత్తదనంలో, కంఫర్ట్‌లో కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. రియాద్ ఎయిర్‌లైన్ వాళ్లు తమను తాము ప్రపంచంలోనే మొట్టమొదటి రియల్ డిజిటల్ ఎయిర్‌లైన్‌గా చెప్పుకుంటున్నారు.

ఈ కొత్త విమానం లోపలంతా సౌదీ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. అక్కడి కళలు, డిజైన్లు, స్మార్ట్ టెక్నాలజీ అన్నీ కలిపి ఒక అద్భుతంలా తయారు చేశారు. ఎకానమీ క్లాస్ నుంచి బిజినెస్ క్లాస్ వరకు ఎవ్వరూ ప్రయాణం చేసినా ఒకే లాంటి క్వాలిటీ, కంఫర్ట్ ఉండే విధంగా చూసుకున్నారు. విమానం లోపల అంతా చాలా సౌకర్యంగా, హాయిగా ఉంటుందటి టాక్.

రియాద్ ఎయిర్ సీఈఓ టోనీ డగ్లస్ మాట్లాడుతూ.. "మేము ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని ప్రయాణికులకు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాము. మా కొత్త విమానంలో సీట్లు చాలా బాగుంటాయి, డిజైన్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. కొత్త టెక్నాలజీతో ప్రతి ప్రయాణం హాయిగా, కంఫర్ట్‌గా ఉండేలా చూసుకున్నాం" అంటూ చెప్పుకొచ్చారు.