Begin typing your search above and press return to search.

కృష్ణాష్టమి సరిగా జరుపుకోలేదంటున్న బ్రిటన్ ప్రధాని... రేపు ఢిల్లీలో గుడికి!

జీ20 సదస్సుకు రావాల్సిన ఉన్నందున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సరిగ్గా జరుపుకోలేకపోయానని తెలిపారు.

By:  Tupaki Desk   |   9 Sep 2023 5:40 PM GMT
కృష్ణాష్టమి సరిగా జరుపుకోలేదంటున్న  బ్రిటన్ ప్రధాని... రేపు ఢిల్లీలో గుడికి!
X

దేశ రాజధాని వేదికగా అత్యంత కీలకమైన జీ-20 శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రగతి మైదాన్‌ లోని భారత్ మండపం వేదికగా జీ20లో సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులకు నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సదస్సులో ఇండియా అల్లుడు, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారనే చెప్పుకోవాలి!

అవును... జీ-20 సదస్సులో పాల్గొనడానికి బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ శుక్రవారమే భారత్‌ కు చేరుకున్న సంగతి తెలిసిందే. తన భార్య, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తితో కలిసి ఆయన ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా తనను ఇండియా అల్లుడు అంటారని ఎక్కడో చదివానని చెప్పారు.

ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్న రిషి సునాక్... ప్రత్యేకంగా చర్చించారు.

కాగా తాను హిందువుగా గర్విస్తున్నానని చెప్పుకున్న రిషి సునాక్... ఢిల్లీలో ఉన్న ఈ రెండు రోజుల్లో ఏదైనా ఓ ఆలయాన్ని సందర్శిస్తాననీ చెప్పిన సంగతి తెలిసిందే. పైగా... జీ20 సదస్సుకు రావాల్సిన ఉన్నందున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సరిగ్గా జరుపుకోలేకపోయానని తెలిపారు.

ఈ క్రమంలో ముందుగా చెప్పినట్లే ఆదివారం అక్షర్ ధాం ఆలయాన్ని సందర్శించడానికి బ్రిటన్ ప్రధాని ప్లాన్ చేసుకున్నారని తెలుస్తుంది. ఢిల్లీలోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ అక్షర్ ధాం ఆలయాన్ని రిషి సునాక్ సందర్శించనున్నారు.

హస్తినలో అత్యంత ప్రత్యేకమైన ఆలయంగా ఉన్న ఈ స్వామి నారాయణ్ అక్షర్ ధాం లో సీతారామచంద్రులు, రాధాకృష్ణులు, శివపార్వతులు, లక్ష్మీనారాయణుల ఆలయాలు ఉపాలయాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో... ఈ ప్రత్యేక మందిరాన్ని ఆదివారం సాయంత్రం రిషి సునాక్ దంపతులు సందర్శించనున్నారు. అనంతరం బ్రిటన్‌ కు బయలుదేరి వెళ్తారు.