Begin typing your search above and press return to search.

ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్ మెంట్.. ఫోటోలు వైరల్!

టీమిండియా, కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీమ్ క్రికెటర్ రింకూ సింగ్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

By:  Tupaki Desk   |   8 Jun 2025 3:53 PM IST
ఎంపీతో రింకూ సింగ్  ఎంగేజ్  మెంట్.. ఫోటోలు వైరల్!
X

టీమిండియా, కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీమ్ క్రికెటర్ రింకూ సింగ్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా... లక్నోలోని ది సెంట్రమ్ హోటల్ లో పార్లమెంట్ సభ్యురాలు ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సన్నిహిత కుటుంబసభ్యులు, స్నేహితులు, పలువురు రాజకీయ, క్రికెట్ ప్రపంచ అతిథులు హాజరయ్యారు.


అవును.. టీమిండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా.. తాజాగా సమాజ్ వాదీ పారీ ఎంపీ ప్రియా సరోజ్ తో నిశ్చితార్ధం జరిగింది. సుమారు 300 మందికి పైగా ప్రత్యేక అతిథుల మధ్య ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సమయంలో.. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.


ఇక.. ఈ వేడుకకు ముందు రింకూ సింగ్ తన కుటుంబసభ్యులతో కలిసి ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహార్ లో గల చౌదేరా వాలి విచిత్ర దేవి ఆలయాన్ని సందర్శించి ఆశీర్వాదం పొందారు! నిశ్చితార్ధం సమయంలో ఈ జంట తెలుపు, గులాబీ రంగు దుస్తులు ధరించి వేదిక వద్దకు వచ్చారు. ఫుల్కర్న్ హాల్ లో పూల అలంకరణల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.

ఈ నిశ్చితార్థానికి సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎంపీలు జయా బచ్చన్, డింపుల్ యాదవ్, ప్రియా సన్నిహితురాలు ఇక్రా హసన్ తో పాటు సమాజ్ వాదీ పారీ సీనియర్ నాయకుడు ప్రొఫెసర్ రాంగోపాల్ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా హాజరయ్యారు. వీరితో పాటు మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పియూష్ చావ్లా కూడా హాజరయ్యారు.