Begin typing your search above and press return to search.

30 దాటితే ఇక అంతేనా? పెళ్లి, పిల్లల విషయంలో షాకింగ్ నిజాలు!

పెళ్లికి సరైన వయసు ఉంటుందా? చాలామంది ఇప్పుడు 30 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

By:  Tupaki Desk   |   18 April 2025 2:00 AM IST
Experts On 30 Age After Marriage And Effects
X

పెళ్లికి సరైన వయసు ఉంటుందా? చాలామంది ఇప్పుడు 30 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. జీవితాన్ని ఆస్వాదించాకే పిల్లల గురించి ఆలోచిద్దాంలే అని మరికొంత కాలం వాయిదా వేస్తున్నారు. కానీ, వయసు పెరిగే కొద్దీ సంతానోత్పత్తి శక్తి తగ్గిపోతుందట. 30 ఏళ్లు దాటితే ఇక అంతేనా? పెళ్లి, పిల్లల విషయంలో ఆలస్యం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో చాలా మంది యువతీయువకులు తమ కెరీర్‌లో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన తర్వాత వివాహం చేసుకోవడం, ఆ తర్వాత కొన్నాళ్లు జీవితాన్ని ఆస్వాదించి ఆపై పిల్లల గురించి ఆలోచించడం ఒక సాధారణ ధోరణిగా మారింది. అయితే, వైద్య నిపుణులు మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా మహిళల్లో 30 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తి శక్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అండాల సంఖ్య తగ్గడం, వాటి నాణ్యత క్షీణించడం వంటి కారణాల వల్ల గర్భం దాల్చడం కష్టమవుతుంది. అలాగే, పురుషుల్లో కూడా వయసు పెరిగే కొద్దీ వీర్యకణాల సంఖ్య, చలనశీలత తగ్గుతాయి. ఇది కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది.

30 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చినా లేదా తండ్రి అయినా పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డౌన్ సిండ్రోమ్ వంటి సమస్యలు వృద్ధాప్యంతో సంబంధం కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబ జీవితంలో సర్దుబాటు చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. చిన్న వయసులో ఉండే ఓర్పు, సహనం వయసు పెరిగే కొద్దీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

కాబట్టి, పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి సరైన వయసును గుర్తించడం చాలా ముఖ్యం. కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యతనివ్వాలి. వైద్యుల సలహా మేరకు సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.