Begin typing your search above and press return to search.

దేశంలో రిచెస్ట్ మినిస్టర్స్ లిస్ట్...ఊహించని ఆస్తులు!

ఈ జాబితాలో ఏపీ, తెలంగాణ మంత్రుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీ మంత్రి పి. నారాయణ రూ. 824 కోట్లతో నాలుగో స్థానంలో ఉండగా, నారా లోకేశ్ రూ. 542 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నారు.

By:  Madhu Reddy   |   7 April 2026 3:00 PM IST
దేశంలో రిచెస్ట్ మినిస్టర్స్ లిస్ట్...ఊహించని ఆస్తులు!
X

భారతదేశ రాజకీయాల్లో అధికారం మాత్రమే కాదు, అపర కుబేరులు కూడా ఉన్నారని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజా సేవలో ఉంటూనే వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్న మంత్రుల జాబితా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు ఈ ధనిక మంత్రుల జాబితాలో టాప్ ప్లేస్‌లో నిలవడం విశేషం. ఈ అంకెలు చూస్తుంటే సామాన్యులకు కళ్ళు చెదరడం ఖాయం. ఆ వివరాలు చూద్దాం..

టాప్ ప్లేస్‌లో పెమ్మసాని.. వేల కోట్ల సామ్రాజ్యం:

ప్రస్తుత లెక్కల ప్రకారం, కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ భారతదేశంలోనే అత్యంత ధనిక మంత్రిగా నిలిచారు. సుమారు రూ.5,705 కోట్ల ఆస్తులతో ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. అమెరికాలో వైద్యుడిగా, వ్యాపారవేత్తగా రాణించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి రికార్డు సృష్టించారు. ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ రూ. 1,413 కోట్లతో నిలవగా, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుమారు రూ. 932 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు.

తెలుగు రాష్ట్రాల హవా.. అపర కుబేరులైన నేతలు:

ఈ జాబితాలో ఏపీ, తెలంగాణ మంత్రుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీ మంత్రి పి. నారాయణ రూ. 824 కోట్లతో నాలుగో స్థానంలో ఉండగా, నారా లోకేశ్ రూ. 542 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నారు. తెలంగాణ నుంచి గడ్డం వివేకానంద్ రూ. 606 కోట్లు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి రూ. 433 కోట్లు కూడా టాప్ 10లో చోటు సంపాదించుకున్నారు. వీరంతా వ్యాపార రంగం నుంచి వచ్చిన వారు కావడంతో వీరి ఆస్తుల విలువ ప్రతి ఏటా పెరుగుతూనే ఉండటం గమనార్హం.

సేవా మార్గంలో సంపన్న నేతలు:

ఈ సంపన్న మంత్రుల జాబితాలో జ్యోతిరాదిత్య సింధియా రూ. 424 కోట్లు, మంగళ్ ప్రభాత్ లోధా రూ. 447 కోట్లు వంటి ఉత్తరాది నేతలు కూడా ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందే వీరంతా రియల్ ఎస్టేట్, విద్య, వైద్యం మరియు పారిశ్రామిక రంగాల్లో స్థిరపడిన వారు కావడం విశేషం. ఏదేమైనా, ఇంతటి భారీ ఆర్థిక నేపథ్యం ఉన్న నేతలు సామాన్య ప్రజల సమస్యల పరిష్కారంలో తమ వంతు కృషి చేస్తారని ఓటర్లు ఆశిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ జాబితాలో ఇంకెన్ని మార్పులు జరుగుతాయో చూడాలి..