Begin typing your search above and press return to search.

యువగళంలో పవన్... ఆర్జీవీ వెటకారం అలా ఉంది!

తాజాగా ఆర్జీవీ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుండటం గమనార్హం. ఈ రెండు ఫోటోల్లోనూ చంద్రబాబు దృష్టిలో పవన్ చిన్న పిల్లాడు అనే అర్ధం వచ్చేలా ఉండటం గమనార్హం.

By:  Tupaki Desk   |   18 Dec 2023 11:19 AM GMT
యువగళంలో పవన్... ఆర్జీవీ వెటకారం అలా ఉంది!
X

సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ ఆన్ లైన్ వేదికగా చేసే అరాచకం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పైగా ఈ మధ్యకాలంలో ఏపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో కాన్ సంట్రేషన్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఆయన... అక్కడ రాజకీయాలకు సంబంధించిన ఆల్ మోస్ట్ అన్ని కీలక విషయాలపైనా ఆన్ లైన్ వేదికగా స్పందిస్తుంటారు. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్, పవన్ లపై తనదైన వెటకారాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా మార్ఫ్డ్ ఫోటోలను పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

అవును... ఏపీ రాజకీయాల్లోని దాదాపు అన్ని కీలక విషయాలపైనా స్పందించే ఆర్జీవీ తాజాగా తాజాగా రెండు ట్వీట్ లు చేశారు. ఇందులో భాగంగా రెండు మార్ఫ్డ్ ఫోటోలు షేర్ చేయడం గమనార్హం. తాజాగా ఆర్జీవీ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుండటం గమనార్హం. ఈ రెండు ఫోటోల్లోనూ చంద్రబాబు దృష్టిలో పవన్ చిన్న పిల్లాడు అనే అర్ధం వచ్చేలా ఉండటం గమనార్హం.

తాజాగా ఆర్జీవీ పోస్ట్ చేసిన రెండు ఫోటోల్లో ఒకదానిలో లోకేష్ పాదయాత్రలో పాల్గొనేలా చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ని చెయ్యిపట్టుకుని నడిపిస్తున్నట్లుగా ఉండగా... మరో ఫోటోలో చంద్రబాబు చంకనెక్కిన పిల్లాడిగా పవన్ ఉండటం గమనార్హం. వాస్తవానికి ఆ రెండు ఫోటోల్లోనూ ఉన్న ఒరిజినల్ వ్యక్తి లోకేష్ కుమారుడు కావడం గమనార్హం. ఆ ఫోటోల్లో లోకేష్ కుమారుడి ఫేస్ ను పవన్ కల్యాణ్ ఫేస్ తో మార్ఫింగ్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఈ ఫోటోలు గతకొన్ని రోజులుగా నెట్టింట దర్శనమిస్తున్నాయి. అయితే ఆ మార్ఫ్డ్ ఫోటోలను స్వయంగా రాం గోపాల్ వర్మ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. వాస్తవానికి కొన్ని వివాదాస్పద ట్వీట్లు చేసిన సమయంలో ఆర్జీవీ.. అవి రాత్రుళ్లు తాను వొడ్కా మూడో పెగ్గులోనో, నాలుగో పెగ్గులోనో ఉండగా పోస్ట్ చేసినట్లు చెబుటుండటం తెలిసిందే. అయితే ఈ ఫోటోలను మధాహ్నం సమయంలో పోస్ట్ చేయడం గమనార్హం.