Begin typing your search above and press return to search.

పిఠాపురంలో పోటీ... తప్పుగా అర్ధంచేసుకున్నారంటున్న ఆర్జీవీ!

ఈ సమయంలో ఆర్జీవీ ట్వీట్.. దానికి కొనసాగింపుగా మరో ట్వీట్.. దానికి వివరణ ఇస్తూ ఇంకో ట్వీట్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   15 March 2024 7:14 AM GMT
పిఠాపురంలో పోటీ... తప్పుగా  అర్ధంచేసుకున్నారంటున్న  ఆర్జీవీ!
X

రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటి నుంచీ ఏపీ రాజకీయం మరింత వేడెక్కిన సంగతి తెలిసిందే. పవన్ ప్రకటనతో ఒకపక్క ఆ విషయంపై సస్పెన్స్ కు తెరదించినట్లవ్వగా... మరోపక్క టీడీపీ కార్యకర్తల మంటల్లో ఆజ్యం పోసినట్లుందని అంటున్నారు. ఈ సమయంలో ఆర్జీవీ ట్వీట్.. దానికి కొనసాగింపుగా మరో ట్వీట్.. దానికి వివరణ ఇస్తూ ఇంకో ట్వీట్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

అవును... చాలా రోజుల సస్పెన్స్ కు, ఎన్నో ఊహాగాణాలకు తెరదించుతూ రానున్న ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేసేదీ పవన్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పిఠాపురం టీడీపీ శ్రేణుల్లో చేలరేగిన మంటల సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ గ్యాప్ లో ఆర్జీవీ ఆన్ లైన్ వేదికగా స్పందించారు.

ఇందులో భాగంగా... "సడన్ డెసిషన్.. నేను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను" అని ట్వీట్ చేశారు. అనంతరం... "సందేహించేవారందరికీ చెబుతున్నా... నేను సీరియస్ గానే ఉన్నాను" అని మరో ట్వీట్ చేశారు. దీంతో... ఇందులో ఏదో మతలబు ఉంటుందని తెలిసినా... ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆ ట్వీట్ వెనకున్న మడతను విప్పేశారు వర్మ!

ఈ క్రమంలో తాను పిఠాపురంలో పోటీ చేస్తున్న మాట వాస్తవమే కానీ... అది ఎన్నికల్లో కాదని స్పష్టం చేశారు ఆర్జీవీ. ఇందులో భాగంగా... తన ట్వీట్ ను తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలిపారు. తాను ఎక్కడా “ఎలక్షన్” అనే పదాన్ని వాడలేదని.. అయితే.. పిఠాపురంలో చిత్రీకరించిన ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో పాల్గొంటున్నట్లు చెప్పడమే తన ఉద్దేశ్యమని అన్నారు. దీంతో... ఈ ట్వీట్ కింద కామెంట్స్ సెక్షన్ లో... యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, సెంటిమెంట్ లతో చిన్న సైజు సినిమా నడుస్తుంది.