Begin typing your search above and press return to search.

జనసేనకు 24 సీట్లే ఎందుకంటే... లైన్ లోకి వచ్చేసిన ఆర్జీవీ!

By:  Tupaki Desk   |   24 Feb 2024 1:29 PM GMT
జనసేనకు 24 సీట్లే ఎందుకంటే... లైన్ లోకి వచ్చేసిన ఆర్జీవీ!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ - జనసేన తమ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. ఇందులో భాగంగా 175లోనూ 118 స్థానాలు ప్రకటించారు. ఇందులో 94 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాల సంగతి బీజేపీ ఎంట్రీ వ్యవహారంపై క్లారిటీ వచ్చాక ఉంటుంది. ఇక 175 లోనూ 24 స్థానాలు జనసేనకు ఇచ్చారు చంద్రబాబు. వాటితో పాటు 25 ఎంపీ సీట్లలోనూ 3 ఇచ్చారు! ఈ వ్యవహారంపై ఆర్జీవీ స్పందించారు.

అవును... టీడీపీ, జనసేన రాజకీయాలపై.. ప్రధానంగా లోకేష్, పవన్ కల్యాణ్, చంద్రబాబులపై స్పందించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారో.. లేక, ఈయనలో ఉత్సాహం కలిగించే ప్రేరేపణలు ఆ ముగ్గురిలో ఉన్నాయో ఏమో కానీ... ఈ ముగ్గురి విషయాలపై ఎవరూ ఊహించని రీతిలో స్పందిస్తుంటారు ఆర్జీవీ. ఈ క్రమంలోనే గతంలో "23" నెంబర్ పై టీడీపీని చీల్చి చెండాడినంత పనిచేశారు.

ఇందులో భాగంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కేటాయించిన నెంబర్ 7691 కాగా... 7+6+9+1 = 23 అంటూ ఆర్జీవీ చేసిన ర్యాగింగ్ అప్పట్లో వైరల్ గా మారింది. అంతక ముందు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుక్కున్నారు కాబట్టి ఆ నెంబరే మిగిలిందంటూ వైసీపీ నేతలు అసెంబ్లీ లోనా బయటా కూడా టార్చర్ చేశారు!

మరోపక్క పవన్ కల్యాణ్ ని విమర్శించే విషయంలో కొంతమంది వైసీపీ నేతలు, సోషల్ మీడియా జనాలూ "పావలా" (25 పైసలు) అనే పదప్రయోగం చేశారు. పవన్ పేరుకు ముందు ఇది జోడించి ట్రోల్ చేసేవారు. ఈ సమయంలో 23 సీట్లు, 25 పైసలు రెండింటినీ మిక్స్ చేసిన ఆర్జీవీ... 23 సీట్లిచ్చిన బాదే, 25 ఇచ్చినా బాదే అని భావించి.. మధ్యేయ మార్గంగా 24 ఇచ్చారంటూ సెటైర్లు వేశారు.

ఈ మేరకు టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆర్జీవీ... "23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు.. 25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారు.. అందుకే మధ్యే మార్గంగా 24 😳" అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కింద కామెంట్లలో చిన్న సైజు యూద్ధమే జరుగుతుంది!