Begin typing your search above and press return to search.

తెరపైకి ఎల్బీస్టేడియం సెంటిమెంట్... రేవంత్ ఫ్యాన్స్ రిక్వస్ట్ ఇదే!

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

By:  Tupaki Desk   |   7 Dec 2023 10:02 AM GMT
తెరపైకి ఎల్బీస్టేడియం సెంటిమెంట్... రేవంత్  ఫ్యాన్స్  రిక్వస్ట్  ఇదే!
X

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. అయితే రాజ్ భవన్ లో జరగాల్సిన ప్రమాణస్వీకారం ప్రజల మధ్యనే ఎందుకు అనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో తదనుగుణంగా చరిత్ర తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్, వైఎస్సార్ ల ప్రమాణ స్వీకారాలు జ్ఞప్తికి వస్తున్నాయి.

అవును... అప్పటివరకూ రాజ్ భవన్ లో జరిగిన ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారాల ట్రెండ్ ను తొలిసారిగా ఎన్టీఆర్ మార్చారు. దీంతో అప్పటినుంచి ఇది కాస్త భారీ సెంటిమెంట్ గా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎన్టీఆర్, వైఎస్సార్ తర్వాత రేవంత్ అదే ఆలోచన చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది! దీంతో ఇది రేవంత్ సెంటి మెంట్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

సాధారణంగా రాజ్ భవన్ లో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమాలను బ్రేక్ చేస్తూ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. ఈ క్రమంలో 1994 డిసెంబర్ లో ఎల్బీ స్టేడియం వేధికగా అశేష జనవాహిని మధ్య నాడు నందమూరి తారకరామారావు ప్రమాణ స్వీకారం చేశారు. నాడు జరిగిన ఈ కార్యక్రమం ఇప్పటికీ చరిత్రలో ఘనంగా నిలిచిపోయింది!

అనంతరం ఆ ట్రెండ్ ను కొనసాగించారు వైఎస్సార్. ఇందులో భాగంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే ఎల్బీ స్టేడియంలో వేలది మంది ప్రజానికం సమక్షంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే వేధికపై ఉచిత విద్యుత్ ఫైల్ పై చారిత్రక సంతకం చేశారు.

ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా ఇదే ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేశారు. దీంతో ఎల్బీ స్టేడియం సెంటిమెంట్ ను రేవంత్ కూడా ఫాలో అయ్యారని.. ఫలితంగా గతంలోని ఇద్దరు ముఖ్యమంత్రుల స్థాయిలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.