Begin typing your search above and press return to search.

తెర మీదకు రేవంత్ కలల సిటీ.. హైదరాబాద్ లో అదెక్కడంటే?

ఇప్పటివరకు ఐటీ కారిడార్ ఆధారంగా హైదరాబాద్ మహానగరాన్ని డెవలప్ చేయాలన్నది గత ప్రభుత్వ ఆలోచనగా నిలిస్తే.. రేవంత్ సర్కారు అందుకు భిన్నమైన ఆలోచనను తెర మీదకు తీసుకొచ్చింది.

By:  Tupaki Desk   |   14 Dec 2023 4:09 AM GMT
తెర మీదకు రేవంత్ కలల సిటీ.. హైదరాబాద్ లో అదెక్కడంటే?
X

అధికార మార్పిడి జరిగినప్పుడు.. అంతకు ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా కొత్తగా కొలువు తీరే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటం మామూలే. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాంటి నిర్నయాల్నే తీసుకుంటుంది. ఇప్పటివరకు ఐటీ కారిడార్ ఆధారంగా హైదరాబాద్ మహానగరాన్ని డెవలప్ చేయాలన్నది గత ప్రభుత్వ ఆలోచనగా నిలిస్తే.. రేవంత్ సర్కారు అందుకు భిన్నమైన ఆలోచనను తెర మీదకు తీసుకొచ్చింది.

ఫార్మాసిటీపై ముఖ్యమంత్రి రేవంత్ సరికొత్త ఆలోచనను తెర మీదకు తీసుకొచ్చారు. మహానగరంలోని కందుకూరు.. యాచారం..కడ్తాల్ మండలం పరిధిలో ఉండే 19వేల ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఫార్మా సిటీ కారణంగా కాలుష్యం వెదజల్లే అవకాశం ఉందని.. అందుకే మహానగరానికిదూరంగా దాన్ని తీసుకెళ్లాలన్న ఆలోచనను తెర మీదకు తీసుకొచ్చారు. ఫార్మా సిటీ స్థానే.. మరో మహానగరాన్ని ఏర్పాటు చేయటం.. దానికి మెట్రో కనెక్టివిటీ ఉండేలా చేయటం తన ఆలోచనగా రేవంత్ తెర మీదకు తీసుకొచ్చారు.

ఫార్మాసిటీ భూముల్లో టౌన్ షిప్.. కందుకూరు సమీపంలో మెగా టౌన్ షిప్ కోసం ప్రణాళికల్నిసిద్ధం చేయాలన్న రేవంత్.. తెలంగాణకు డ్రై పోర్టు కోసం ప్రణాళికల్నిసిద్ధం చేయాలని కోరారు. ఇదంతా చూస్తే.. రేవంత్ సర్కారు ప్రాధామ్యత మొత్తం ఫార్మాసిటీ నడుమ ఉండనుందన్న విషయం తాజా రివ్యూతో తేల్చేశారని చెప్పాలి. అదే జరిగితే.. కందుకూరు.. యాచారం.. కడ్తాల్ మండలంలోని భూముల ధరలకు అమాంతం రెక్కలు వచ్చే వీలుందంటున్నారు.

మరి.. దీనిపై రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు చర్చగా మారే వీలుంది. ఏమైనా.. ఇప్పటివరకు నగరం మొత్తం ఒక వైపునకు వంగేలా కేసీఆర్ సర్కారు వ్యవహరించిందన్న మాటల వేళ.. అందుకు పూర్తి వ్యతిరేక దిశలో ఉండే ప్రాంతంలో మెగాసిటీ ప్రతిపాదన తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్.. తన కలను ఆవిష్కరించారని చెప్పాలి. మరి.. రియల్ సంస్థల రెస్పాన్స్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా చెప్పాలి.