Begin typing your search above and press return to search.

సీఎం అయ్యాక ఫ్యామిలీ మెంబర్స్ కు రేవంత్ చెప్పింది ఇదేనట

తాను ముఖ్యమంత్రిని అయ్యాక ఒక కొత్త పోకడను తాను గమనించానని.. అధికారులే తమ కుటుంబ సభ్యుల్ని సంప్రదించటం చూశానని.. మా సోదరులకు ఫోన్ చేసి వెళ్లి కలుస్తున్న విషయాన్ని తాను గుర్తించినట్లు చెప్పారు.

By:  Tupaki Desk   |   7 Jan 2024 4:32 AM GMT
సీఎం అయ్యాక ఫ్యామిలీ మెంబర్స్ కు రేవంత్ చెప్పింది ఇదేనట
X

అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మాత్రమే కాదు.. చేతల్లోనూ మార్పు వస్తుంది. అందుకు భిన్నంగా వ్యవహరించటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. ఈ విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన తీరును ప్రదర్శిస్తున్నారు. తన కుటుంబ సభ్యుల్ని కలవటం ద్వారా.. అధికారులు లబ్ధి పొందాలని చూస్తే.. అది వారికే నష్టం జరుగుతుందన్న విషయాన్ని స్పష్టం చేయటం విశేషం.

గతానికి భిన్నంగా తన కుటుంబ సభ్యుల్ని అధికారులే సంప్రదిస్తున్నారని.. ఈ ధోరణి కరెక్టు కాదని పేర్కొన్నారు. సాధారణంగా అత్యున్నత స్థానాల్లోకి ఎవరైనా చేరిన తర్వాత.. తమకు అవసరమైన పనుల్ని పూర్తి చేసుకునేందుకు వీలుగా కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేయటం చేస్తుంటారు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యుల ద్వారా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వేళలో.. ఆయా కుటుంబ సభ్యుల కారణంగా ప్రభుత్వాలకు చెడ్డపేరు వస్తుంది. ఈ విషయంలో మీ తీరు ఏంటి? అని సీఎం రేవంత్ ను అడిగినప్పుడు ఆయన నోటి నుంచి అనూహ్య రీతిలో సమాధానం రావటం విశేషం.

మొదటి నుంచి తన విషయాల్లో తన సోదరుల జోక్యం పెద్దగా ఉండదని.. ఎవరూ ఏమీ ఆశించని..వారి వ్యాపారాలు వారు చేసుకుంటూ ఉంటారని చెప్పారు రేవంత్. ఒక సోదరుడు మాత్రం తన నియోజకవర్గంలోని అంశాల్ని చూసుకుంటారే తప్పించి.. సిఫార్సులకు పాల్పడరని చెప్పారు. తాను ముఖ్యమంత్రిని అయ్యాక ఒక కొత్త పోకడను తాను గమనించానని.. అధికారులే తమ కుటుంబ సభ్యుల్ని సంప్రదించటం చూశానని.. మా సోదరులకు ఫోన్ చేసి వెళ్లి కలుస్తున్న విషయాన్ని తాను గుర్తించినట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి అయ్యాక తన కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టి చెప్పాల్సింది మొత్తం చెప్పానని.. వారి చిన్న కదలిక కూడా ప్రమాదానికి దారి తీస్తుందని.. తననేం చేయలేరని.. అందుకే వారిని టార్గెట్ చేస్తారని.. ఊరంతా వారిని చూస్తుందని చెప్పినట్లుగా చెప్పారు. ప్రభుత్వంలో జోక్యం చేసుకోవద్దని కోరినట్లు చెప్పారు. తన సోదరులు సంస్కారవంతులని.. తనకంటే మంచి ఆలోచనలు ఉన్న వారని.. వారు జోక్యం చేసుకునే అవకాశం లేదని చెప్పారు. ఇన్నేళ్లు తాను ఏ హోదాలో ఉన్నప్పుడు కూడా తన సోదరుల వల్ల తనకు ఎలాంటి సమస్యలు రాలేదని గుర్తు చేశారు.

'ఎవరైనా అధికారులు ఎక్కువసార్లు మా కుటుంబ సభ్యులను కలిసి ఏదో పని చేసుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ల ఉద్యోగం ఊడుతుందని మాత్రం గ్యారెంటీగా చెబుతున్నా. వాళ్లకేమైనా కావాలంటే నేనే నేరుగా కలుస్తున్నా. మా కుటుంబ సభ్యుల్ని కలిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు' అంటూ అధికారులకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చేశారు సీఎం రేవంత్. మొత్తంగా ఇంత క్లారిటీగా విషయాల్ని ఓపెన్ గా చెప్పేయటం చాలా అరుదైన అంశంగా చెబుతున్నారు.