Begin typing your search above and press return to search.

కేసీఆర్ కలల భవనంలో రేవంత్ పాలన...

కేసీఆర్ పాత సచివాలయం భవనం అంతా బాగా ఉన్నా వాస్తు పేరుతో దాన్ని కూల్చేసి సుమారుగా ఆరు వందల కోట్ల రూపాయల సొమ్ము వెచ్చింది కొత్త సచివాలయం కట్టారు.

By:  Tupaki Desk   |   8 Dec 2023 3:00 AM
కేసీఆర్ కలల భవనంలో రేవంత్ పాలన...
X

కేసీఆర్ కి ఫార్మ్ హౌజ్ సీఎం అని విపక్షాలు పేరు పెట్టాయి. కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాటు పాలించారు. రెండు దఫాలుగా బీఆర్ఎస్ గెలిచింది. కేసీఆర్ పాత సచివాలయం భవనం అంతా బాగా ఉన్నా వాస్తు పేరుతో దాన్ని కూల్చేసి సుమారుగా ఆరు వందల కోట్ల రూపాయల సొమ్ము వెచ్చింది కొత్త సచివాలయం కట్టారు. ఈ కొత్త సచివాలయం అద్భుతంగా ఉంటుంది.

అత్యంత శ్రద్ధ తీసుకుని మరీ కేసీఆర్ తన కలల సౌధంగా నిర్మించారు. దానిని ఆయన స్వయంగా ఏప్రిల్ 30న ప్రారంభించారు. ఆ సమయంలో విపక్షాలను ఎవరినీ ఆహ్వానించలేదని కూడా విమర్శలు వచ్చాయి. ఇక రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉంటూ కొత్త సచివాలయంలోకి రావాలని ఆరు నెలల క్రితం ఒక ప్రయత్నం చేశారు.

ఆనాడు ఆయన ప్రజల సమస్యల మీద మునిసిపల్ ముఖ్య కార్యదర్శిని కలిసేందుకు యత్నించారు. కానీ ఆయన్ని పోలీసులు సచివాలయానికి ఏకంగా కిలోమీటర్ దూరంలో అడ్డుకుని వెనక్కి పంపించారు. ఇపుడు చూస్తే అదే సచివాలయంలో సీఎం గా రేవంత్ రెడ్డి తన పాలన ప్రారంభించారు.

ఆయన ఆరవ అంతస్తులో ముఖ్యమంత్రి చాంబర్ లో సంప్రదాయంగా పూజాది కార్యక్రమాలు చేసుకుని మరీ బాధ్యతలు స్వీకరించారు. ఆరు నెలల క్రితమే సచివాలయం ప్రారంభించినా రేవంత్ రెడ్డి మాత్రం అడుగుపెట్టింది గురువారం నాడు మాత్రమే. అది కూడా సీఎం హోదాలో ఆయన అప్పట్లో సచివాలయానికి వద్దామని చేసిన ప్రయత్నాలను బీఆర్ ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

ఇదిలా ఉండగా బహు చక్కగా కట్టిన కొత్త సచివాలయంలో కేసీఆర్ ఎక్కువ సార్లు ఉండలేదు అని అంటారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ అగ్ర నేతలు ఇదే విషయం మీద విమర్శించారు. కొత్త సచివాలయం కట్టినా కేసీయార్ వచ్చింది ఏదీ లేదు ఆయన ఫార్మ్ హౌజ్ కే పరిమితం అయ్యారంటూ దుయ్యబెట్టారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి కోసమే కట్టినట్లుగా ఉంది ఈ న్యూ సెక్రటేరియట్ అని అంటున్నారు.

అందుకే అత్యంత సౌకర్యవంతంగా విలాసవంతంగా కట్టిన సచివాలయంలో రేవంత్ రెడ్డి ఇపుడు ముఖ్యమంత్రి హోదాలో ప్రజా పాలన చేయనున్నారు. అలా రేవంత్ రెడ్డి ఎంతో అదృష్టవంతుడు అని అంటున్నారు.