Begin typing your search above and press return to search.

రేవంత్ కి ఫ్లయింగ్ కిస్... ఆ యువతి ఆనందం పీక్స్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువనే విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని మాస్ లీడర్స్ లో ఎక్కువ యూత్ ఫాలోయింగ్ ఉన్న నేతగా ఆయనను యువత కొనియాడుతుంటారు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 7:41 AM GMT
రేవంత్  కి ఫ్లయింగ్  కిస్... ఆ యువతి ఆనందం పీక్స్!
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువనే విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని మాస్ లీడర్స్ లో ఎక్కువ యూత్ ఫాలోయింగ్ ఉన్న నేతగా ఆయనను యువత కొనియాడుతుంటారు. డ్రెస్సింగ్ లో రేవంత్ సింప్లిసిటీ.. ఆయనకు నెట్టింట ఉన్న పబ్లిసిటీ.. పోరాటాల విషయంలో ఆయన కనబరిచే రియాలిటీకి యువత ఫిదా అవుతుంటారు! అయితే అది తెలంగాణలోనే కాదు సుమా... విదేశాల్లో కూడా!!

అవును... తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడంలో యువత పాత్ర కీలకం అని చెబుతుంటారు. ప్రధానంగా పీసీసీ చీఫ్ అయిన అనంతరం తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై రేవంత్ బలంగా కొట్లాడారని బలంగా విశ్వసిస్తుంటారు! ఈ సమయంలో లండన్ లో కూడా రేవంత్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. అక్కడ ఒక యువతి రేవంత్ ని చూసి ఉబ్బితబ్బిబ్బయిపోయింది.. ఈ క్రమంలో సీఎంకు ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చేసింది.

వివరాళ్లోకి వెళ్తే... దావోస్‌ పర్యటన ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్‌ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం "థేమ్స్‌" నది పాలకమండలితో పాటు పోర్ట్‌ ఆఫ్‌ లండన్‌ అథారిటీ ఉన్నతాధికారులతో భేటీ అయిన రేవంత్.. వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వేదికపై రేవంత్ ని చూసిన ఒక యువతి పట్టరాని సంతోషానికి లోనైంది.

వేదికపై రేవంత్ రెడ్డి మాట్లాడిన అనంతరం... వేదికవద్దకు వెళ్లిన ఓ యువతి ఆయనకు బోకేను అందించింది. దాన్ని రేవంత్ రెడ్డి తీసుకోవడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ఈ సమయంలో రేవంత్ రెడ్డి ఆమెకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. దీంతో ఎగిరి గంతులు వేసిన ఆ యువతి.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

కాగా... పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా జరిగిన దావోస్‌ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారని ప్రకటించిన సంగతి తెలిసిందే! దీంతో తెలంగాణ రాష్ట్రం కొత్త రికార్డు నెలకొల్పిందని.. గత ఏడాది తెలంగాణ సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇప్పుడు సాధించిన పెట్టుబడులు రెండింతలు అని అంటున్నారు.