Begin typing your search above and press return to search.

బీఆరెస్స్ పై రివేంజ్... రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ సందర్భంగా కారుదిగుతున్న ఆ పార్టీ నేతల సంఖ్యే ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు

By:  Tupaki Desk   |   12 April 2024 9:57 AM GMT
బీఆరెస్స్ పై రివేంజ్... రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ పదేళ్లపాటు ప్రజల ఆగ్రహానికి బలైన అనుభవానికి తగ్గట్లుగా పాలన అందిస్తున్నారని.. ఇదే సమయంలో రేవంత్ మార్కు దూకుడు రాజకీయం తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బీఆరెస్స్ కు రాజకీయంగా తగాలాల్సిన దెబ్బలు బలంగానే కొడుతున్నారనే చర్చా తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా కారుదిగుతున్న ఆ పార్టీ నేతల సంఖ్యే ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు.

మరోపక్క రానున్న లోక్ సభ ఎన్నికల్లోనూ బీఆరెస్స్ ను తేరుకోలేని దెబ్బకొట్టాలని రేవంత్ ఫిక్స్ అయ్యారని.. ఈ ప్రయత్నంలో భాగంగా తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆరెస్స్ ను తేరుకోలేని దెబ్బకొట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో సుమారు 25 మంది బీఆరెస్స్ ఎమ్మెల్యేలు తమతో చల్ లో ఉన్నారని.. తాము డోర్లు ఓపెన్ చేయకపోయినా బద్దలు కొట్టుకుని మరీ వచ్చేస్తున్నారని కాంగ్రెస్ మంత్రులు చెబుతున్నారు.

మరోపక్క... గతంలో కేసీఆర్ & కో లు రేవంత్ కు పెట్టిన ఇబ్బందుల ఫలితాలు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయని.. ఈ విషయంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ లు వేస్తున్నారని అంటున్నారు. ఇక లోక్ సభ ఎన్నికల సందడి కూడా ముగిస్తే.. అప్పుడు అసలు ఆట మొదలవుద్దని మరికొంతమంది అంటున్నారు అయితే.. తాను ఇంకా బీఆరెస్స్ పై రివేంజ్ మొదలుపెట్టలేదని అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

అవును... బీఆరెస్స్ ప్రతీకారం తీర్చుకునే పనులు తాను ఇంకా మొదలుపెట్టలేదని అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాజాగా దేశరాజధానిలో ఇండియా టీవీ చేపట్టిన "ఆప్ కి అదాలత్" కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీఆరెస్స్ పై రివేంజ్ కి సంబంధించిన చర్చ తెరపైకి రావడం గమనార్హం.

ఇందులో భాగంగా... "మీరు బీఆరెస్స్ పై ప్రతికారం తీర్చుకుంటున్నారా"? అని సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ ప్రశ్నించగా... దానికి సమాధానంగా... "అలాంటిది ఏమీ లేదు!".. "అలా ఉండదు" వంటి సమాధానాలు ఎక్స్ పెక్ట్ చేసిన వీక్షకులకు షాకిస్తూ... సర్ ప్రైజ్ సమాధానం చెప్పారు రేవంత్! ఇందులో భాగంగా... "నేను ఇంకా మొదలుపెట్టలేదు" అని ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. దీంతో... ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.