Begin typing your search above and press return to search.

ఏపీపై రేవంత్ బ్లాక్ బస్టర్ ప్లాన్

మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు.. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ జాబితాలో ఏపీ కూడా ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Dec 2023 11:30 PM GMT
ఏపీపై రేవంత్ బ్లాక్ బస్టర్ ప్లాన్
X

పోయిన చోటే వెతుక్కోవాలన్న సామెత గురించి తెలిసిందే. తాను తీసుకున్న నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణలో తమ చేతికి అధికారం వచ్చిన వేళ.. ఏపీ మీద ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ అధికారపక్షంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రేవంత్ కు స్పెషల్ టాస్కు ఇచ్చినట్లుగా చెబుతుున్నారు. పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతున్న వేళలో.. అందుకు తగ్గట్లు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు.

మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు.. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ జాబితాలో ఏపీ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఏపీ అధికార పక్షమైన వైసీపీకి సంబంధించిన 175కు 175 స్థానాల్ని సొంతం చేసుకోవటానికి వీలుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను భారీ ఎత్తున మార్పులు చేయటానికి వీలుగా కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వలేమన్న విషయాన్ని తెలియజేస్తూ.. కొత్త ఇన్ ఛార్జిలను ఎంపిక చేయటం తెలిసిందే.

దీంతో.. సిట్టింగుల్లో పలువురు తమకు టికెట్ అవకాశం దక్కుంటే.. ప్రత్యామ్నాయాల మీద ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు వారికున్న ఆప్షన్ల విషయానికి వస్తే.. టీడీపీ.. జనసేన. ఈ రెండు పార్టీలతో మొన్నటివరకు తగువులు పెట్టుకొని ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లటం ప్రాక్టికల్ గా వర్కువుట్ అయ్యే పరిస్థితి లేదు. దీనికి తోడు టికెట్లకు నో అన్న తర్వాత తమ పార్టీలోకి వచ్చే నేతలకు ఈ రెండు పార్టీలు అవకాశం ఇచ్చే వీల్లేదు.

ఇక.. మిగిలిన బీజేపీ.. కాంగ్రెస్ లో అత్యధిక నేతలకు కాంగ్రెస్ కు మించిన సరైన ఆప్షన్ లేదన్న మాట వినిపిస్తోంది. విభజన నేపథ్యంలో ఒకప్పుడు కళకళలాడిన ఏపీ కాంగ్రెస్ ఇప్పుడు ఎంతటి దీన స్థితిలో ఉందన్న సంగతి తెలిసిందే. మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ మరోసారి తన లక్ ను పరీక్షించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా. వైసీపీలో టికెట్లు దక్కని వారిపై గురి పెట్టనున్నట్లు చెబుతున్నారు.

ఏపీకి చెందిన ఏ పార్టీ నేతలైనా సరే కామన్ గా ఉండే అంశం.. హైదరాబాద్ లో ఆస్తులు ఉండటం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో నేతల్ని కంట్రోల్ చేసే ‘కీ’ రేవంత్ చేతిలో ఉందన్నది ఒప్పుకోవాల్సిన అంశం. గతంలోనూ ఏపీకి చెందిన పలువురు నేతల్ని తమకు తగ్గట్లుగా నడుచుకునేలా చేయటంలో కేసీఆర్ చేసిన మేజిక్ తెలిసిందే. ఇప్పుడు అదే రోల్ రేవంత్ చేతికి అప్పజెప్పి.. ఏపీలో పార్టీ విస్తరణ మీద కాంగ్రెస్ ఫోకస్ చేసే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు.. ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ ను బలమైన శక్తిగా మార్చే భారీ ప్లాన్ రేవంత్ వద్ద ఉందన్న మాట ఆయన సన్నిహితుల నోట వినిపిస్తూ ఉంటుంది. ఓవైపు అధిష్ఠానం ఆకాంక్ష.. మరోవైపు రేవంత్ కున్న అవగాహన ఏపీ కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి.