Begin typing your search above and press return to search.

అదరకొట్టేసిన రేవంత్.. లిక్కర్.. నిక్కర్ పార్టీ అంటూ భారీ పంచ్

టీపీసీసీ రథసారధిగా ఉన్న రేవంత్ రెడ్డి లోక్ సభలో మాట్లాడిన మాటలు ఆసక్తికరంగానే కాదు. ఆయన ధైర్యాన్ని మెచ్చుకునేలా ఉన్నాయని చెప్పాలి.

By:  Tupaki Desk   |   10 Aug 2023 5:14 AM GMT
అదరకొట్టేసిన రేవంత్.. లిక్కర్.. నిక్కర్ పార్టీ అంటూ భారీ పంచ్
X

రాజకీయంగా విమర్శలు.. ప్రతి విమర్శలు.. ఘాటు వ్యాఖ్యలు సర్వసాధారణం. అయితే.. తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించే అధినేత ముందు.. దిమ్మ తిరిగేలా వ్యాఖ్యలు చేయటం.. పదునైన మాటల్ని వాడటం అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే.. ఆ మాటల ప్రభావం తర్వాతి రోజుల్లో చూపించే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కాస్త భిన్నం. ప్రెస్ మీట్ లు.. బహిరంగ సభల్లో ఆయన చేసే వ్యాఖ్యలు తీవ్రంగా ఉండొచ్చు. కానీ.. కీలక నేతలు.. ప్రభావాన్ని చూపించే వారి ముందు ఆయన ఆచితూచి మాట్లాడతారే కానీ తొందరపడరు.

అంతటి కేసీఆరే అంత జాగ్రత్తగా ఉండే వేళ.. టీపీసీసీ రథసారధిగా ఉన్న రేవంత్ రెడ్డి లోక్ సభలో మాట్లాడిన మాటలు ఆసక్తికరంగానే కాదు. ఆయన ధైర్యాన్ని మెచ్చుకునేలా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే.. అవిశ్వాస తీర్మానంలో భాగంగా ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. అమిత్ షా ఎదుట ఆయన చేసిన వ్యాఖ్యలు ఘాటుగా ఉన్నాయి.

తమ టార్గెట్ అయిన బీజేపీని తప్పు పడుతూనే.. తెలంగాణ అధికార పక్షంలో ఆ పార్టీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. తెరచాటు ఒప్పందాలు ఉన్నట్లుగా జరిగే ప్రచారానికి అద్దం పట్టేలా రేవంత్ మాటలు ఉండటం గమనార్హం.

'లిక్కర్ పార్టీ.. నిక్కర్ పార్టీ ఒక్కటై తెలంగాణను దోచుకుంటున్నారు. తెలంగాణకు ఇచ్చిన హామీల్ని కేంద్రం నెరవేర్చలేదు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ సభకు వస్తే బావుండేది. మణిపూర్ లో జరుగుతున్న మారణకాండకు ఆదివాసీలకు క్షమాపణ చెప్పి ఉండే వారి గౌరవం మరింత పెరిగేది. కానీ.. ఆదివాసీలపైనా.. గిరిజనులపైనా ప్రధానికి చులకనబావం ఉంది.

తొమ్మిదేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు" అంటూ విరుచుకుపడ్డారు.రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నంతసేపు ఆయన మాటల్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జాగ్రత్తగా వినటం కనిపించింది. ఘాటైన పదజాలంతో మాట్లాడిన రేవంత్ మాటలు.. అమిత్ షా మీద ప్రభావం చూపుతాయంటున్నారు.

బీజేపీకి.. బీఆర్ఎస్ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పేలా చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే.. రేవంత్ ఉపయోగించిన భాషపై చర్చ జరుగుతోంది. రేవంత్ ధైర్యాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు.