Begin typing your search above and press return to search.

నిన్న జగన్... నేడు రేవంత్... తొందరపడాల్సిందే...!?

నిన్న జగన్ ఏ మాట అయితే చెప్పారో నేడు రేవంత్ నోట అదే మాట వచ్చింది. దాంతో తొందర పడాల్సిందే అంటున్నారు

By:  Tupaki Desk   |   18 Dec 2023 6:45 PM GMT
నిన్న జగన్... నేడు రేవంత్... తొందరపడాల్సిందే...!?
X

నిన్న జగన్ ఏ మాట అయితే చెప్పారో నేడు రేవంత్ నోట అదే మాట వచ్చింది. దాంతో తొందర పడాల్సిందే అంటున్నారు. ఇంతకీ ఏ మాట జగన్ చెప్పారు అన్నది కనుక చూస్తే ఎన్నికల కోసం అని జవాబు చెప్పాల్సి ఉంటుంది. జగన్ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలు తోసుకుని వస్తున్నాయని చెప్పారని ప్రచారం సాగింది. అంతా అనుకుంటున్నట్లుగా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు కాదని అవి ముందుకు రీ షెడ్యూల్ అవబోతున్నాయని జగన్ మంత్రులకు చెప్పేశారు.

అంటే ఈసారి మాచి చివరలోనే ఎన్నికలు జరుగనున్నాయని జగన్ హింట్ ఇచ్చేశారు. దానికి కారణాలు అయితే ఆయన వివరించినట్లుగా వైసీపీ వర్గాల నుంచి ఏ సమాచారం అయితే లేదు కానీ అసెంబ్లీ ఎన్నికలు గత సారి కంటే పది నుంచి పదిహేను రోజుల ముందుకు జరుగుతాయని కూడా చెప్పారు. 2019లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. ఈసారి మార్చి నెలాఖరులో జరగవచ్చు అని ఒక సారాంశం అయితే వచ్చేసింది.

ఇక ఇపుడు లేటెస్ట్ గా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మాట అంటున్నారు. ఎంపీ ఎన్నికలు నెల ముందుగానే వస్తాయని రేవంత్ రెడ్డి పార్టీ వారితో చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. దాంతో జనవరిలోనే ఎంపీ అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని పీసీసీ చీఫ్ హోదాలో కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది.

అటు రేవంత్ కి ఇటు జగన్ కి ఒకే రకమైన సమాచారం అయితే వచ్చింది. ఇద్దరు ముఖ్యమంత్రులకు కేంద్ర వర్గాల నుంచే ఈ సమాచారం వచ్చినట్లుగా చెబుతున్నారు. దాంతో ఇది బీజేపీ ఆలోచన అని అంటున్నారు. బీజేపీ నెల రోజుల ముందుకు లోక్ సభ ఎన్నికలను జరిపింది అని అంటున్నారు. ఏప్రిల్ మే నెల కాకుండా మార్చి ఏప్రిల్ నెలలలో ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని తెలుస్తోంది. దీని వల్ల రాజకీయంగా భారీ లబ్దిని బీజేపీ కోరుతోంది.

ఇండియా కూటమి ఇపుడు డీలా పడి ఉంది. విపక్షాలలో ఐక్యత ఇబ్బందిగా మారింది. దాంతో పాటు మూడు రాష్ట్రాలలో గెలిచిన జోష్ లో బీజేపీ ఉంది. ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని అట్టహాసంగా ప్రారంభించడం ద్వారా బీజేపీ హిందూత్వకు గట్టిగా పదును పెడుతుందని అంటున్నారు. అదే జోష్ తో హుషార్ తో లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొంటుంది అని అంటున్నారు. మొత్తానికి బీజేపీ హ్యాట్రిక్ విజయం కోసం ఎన్నికల షెడ్యూల్ ని కాస్తా ముందుకు జరుపుతోంది. మరి ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరికి లాభం అన్నది కూడా చర్చగా ఉంది.

ఇటీవలే తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి ఆ జోరు తగ్గకుండనే ఎంపీ ఎన్నికలు రావడం నిజంగా లాభించే పరిణామమే అంటున్నారు. కొత్త ప్రభుత్వం మీద మోజు ఇంకా ఉండగానే ఎంపీ ఎన్నికలు జరిగితే తెలంగాణాలో భారీ స్థాయిలో లాభపడేది మాత్రం కాంగ్రెస్ అని అంటున్నారు. ఆ తరువాత బీజేపీకి చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు.

ఇక ఏపీలో చూస్తే అధికార వైసీపీ దూకుడు పెంచింది. ఆ మాటకు వస్తే గత రెండేళ్ళుగా జనంలోనే ఉంది. దాంతో వైసీపీకి కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు అని అంటున్నారు. ఇటీవల జాతీయ సర్వేలు సైతం వైసీపీకి మొగ్గు ఉందని చెబుతున్న నేపధ్యం ఉంది. మరో వైపు టీడీపీ చంద్రబాబు అరెస్ట్ తరువాత సర్దుకోలేకపోతోంది అని అంటున్నారు. బాబు అరెస్ట్ కి ముందు ఉన్న స్పీడ్ ని టీడీపీ జనసేన కంటిన్యూ చేయలేకపోయాయి. ఇక జనవరి వచ్చకా జోరు పెంచినా అది ఎన్నికల వేడిలో కలసిపోతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో ఈసారి హోరాహోరీ పోరు సాగడం ఖాయమ్నై అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.