Begin typing your search above and press return to search.

టీ ఎమ్మెల్సీ ఎన్నికలు.. జాబితాతో ఢిల్లీకి సీఎం రేవంత్

తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో అభ్యర్థుల కసరత్తును కాంగ్రెస్ స్పీడప్ చేసింది.

By:  Tupaki Desk   |   13 Jan 2024 5:20 AM GMT
టీ ఎమ్మెల్సీ ఎన్నికలు.. జాబితాతో ఢిల్లీకి సీఎం రేవంత్
X

తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో అభ్యర్థుల కసరత్తును కాంగ్రెస్ స్పీడప్ చేసింది. నామినేషన్లకు తుది గడువు జనవరి 18 అన్న విషయం తెలిసిందే. ఈ నేపత్యంలో అధిష్ఠానం నుంచి ఆమోదం పొందేందుకు వీలుగా జాబితాను సిద్ధం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీలో అధినాయకత్వంతో మాట్లాడి.. అభ్యర్థుల్ని ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 14న దావోస్ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి.. తన టూర్ కు ముందే.. ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఫైనల్ చేసేసి వెళతారని చెబుతున్నారు.

ఫైనల్ లిస్టు తీసుకెళ్లిన రేవంత్.. తన జాబితాను ఓకే చేయించుకుంటారా? లేదా మరేదైనా మార్పులు ఉంటాయా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ ఇప్పటికే రేవంత్ అభిప్రాయాన్ని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుంచి ఫీడ్ బ్యాక్ ను తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన క్లియర్ పిక్చర్ అధినాయకత్వం వద్ద ఉందంటున్నారు.

తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీకెట్ ఆశిస్తున్న అభ్యర్థుల్లో అద్దంకి దయాకర్.. మహేశ్ కుమార్ గౌడ్.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ.. నాంపల్లి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఫిరోజ్ ఖాన్.. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బరిలోకి దిగి పరాజయం పాలైన అజారుద్దీన్.. సీనియర్ నేత చిన్నారెడ్డి.. పటేల్ రమేశ్ రెడ్డిలు ఎమ్మెల్సీ పదవుల్ని ఆశించే వారిలో ఉన్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.