Begin typing your search above and press return to search.

మనవడితో రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య వేడుకలు.. ఫోటో వైరల్!

అవును... స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనవడిని ఎత్తుకుని ఫోటో దిగిన రేవంత్ రెడ్డి.. ఆ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   15 Aug 2023 10:50 AM GMT
మనవడితో రేవంత్  రెడ్డి స్వాతంత్ర్య వేడుకలు.. ఫోటో వైరల్!
X

"ప్రపంచ చరిత్రలో యుద్ధం లేకండా విముక్తి లేదు. రక్తపాతం లేకుండా స్వాతంత్ర్యం లేదు. కానీ అహింస అనే ఆయుధంతో రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన భారతదేశం ప్రపంచానికే ఆదర్శం" అని ట్వీట్ చేసిన టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... అనంతరం తన మనవడిని ఎత్తుకుని ఒక ఫోటో పోస్ట్ చేశారు.


అవును... స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనవడిని ఎత్తుకుని ఫోటో దిగిన రేవంత్ రెడ్డి.. ఆ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఫోటోకి "తన మనవడు రియాన్ష్ కి ఇది మొదటి ఇండిపెండెన్స్ డే" అని తెలిపారు. దీంతో... రియాన్ష్ కి విషెస్ చెబుతూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇదే సమయంలో గాంధీభవన్‌ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆపై గాంధీభవన్‌ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈరోజు ప్రధానంగా ముగ్గురిని స్మరించుకోవాలని తెలిపారు.

అందులో భాగంగా... "అహింస మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ.. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కులు కల్పించారు అంబేద్కర్.. కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న దేశాన్ని సంక్షేమ ఫలాలు అందించిన మహా నేత నెహ్రూ" అని అన్నారు.

ఇదే క్రమంలో... దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత ఇందిరా గాంధీ అని రేవంత్ కొనియాడారు. దేశంలో ఐటీ రంగంలో గొప్ప స్ఫూర్తినిచ్చిన గొప్ప ప్రధాని రాజీవ్ గాంధీ అని తెలిపారు. అదేవిధంగా దేశాన్ని ఆర్థికంగా పురోగతివైపు నడిపించింది పీవీ నరసింహా రావు, మన్మోహన్ సింగ్ అని పేర్కొన్నారు.