Begin typing your search above and press return to search.

స్విట్జర్లాండ్ లో కలవబోతున్న రేవంత్ అండ్ జగన్...!?

ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా ఒక విదేశీ పర్యటన చేయబోతున్నారు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 3:30 AM GMT
స్విట్జర్లాండ్ లో కలవబోతున్న రేవంత్ అండ్ జగన్...!?
X

ఇది నిజంగా ఒక గొప్ప విషయమే. అలాగే అరుదైన ఘటనగానే చూడాల్సి ఉంటుంది. ఎందుచేతనంటే ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరాయి దేశంలో కలవబోవడం. ఆ ఇద్దరూ ఎవరో కాదు వైఎస్ జగన్, అలాగే రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులను కలిపే వేదిక స్విట్జర్లాండ్ అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా ఒక విదేశీ పర్యటన చేయబోతున్నారు. ఆయన కొత్త ఏడాది జనవరి 15 నుంచి 19 మధ్యలో స్విట్జర్లాండ్ లో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ జరిగే దావోస్ ప్రపంచ ఆర్ధిక సదస్సులో రేవంత్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర ప్రతినిధిగా పాల్గొనబోతున్నారు.

ఆయన వెంట మంత్రులు శ్రీధర్ బాబు, ఇతర అధికారులు కూడా ఉంటారు. ఇది ఇపుడు తెలంగాణా ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన ఒక సమాచారంగా ప్రచారంలో ఉంది. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో రేవంత్ రెడ్డి గళం విప్పి తెలంగాణాకు పెట్టుబడులను ఆకట్టుకోవడం కోసం ఈ టూర్ ని వినియోగించుకోబోతున్నారు అన్న మాట.

ఇక ఏపీ సీఎం జగన్ కూడా గతంలో దావోస్ సదస్సుకు అటెండ్ అయ్యారు. ఇపుడు మరోసారి ఆయన కూడా వెళ్లబోతున్నారు అని అంటున్నారు. ముఖ్యమంత్రి కూడా స్విట్జర్లాండ్ కి వెళ్ళాలని గట్టిగా ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే ఎన్నికలు ఏపీలో దగ్గరలో ఉన్నాయి.

దాని కంటే ముందు వచ్చే ఈ ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు తేవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సూపర్ సక్సెస్ మంత్రంగా చేసుకోవచ్చు అన్నది వైసీపీ అధినాయకత్వం ఆలోచనగా ఉంది అని అంటున్నారు. దాంతో తెలుస్తున్న భోగట్టా ఏంటి అంటే జగన్ సైతం చలో స్విట్జర్లాండ్ అంటున్నారుట.

మరి అటు రేవంత్ ఇటు జగన్ ఇద్దరూ కొత్త ఏడాది మొదట్లోనే ఫస్ట్ కలిసే చోటు ఏంటి అంటే అది స్విట్జర్లాండ్ అనే అంతా అంటున్నారు. ఈ మేరకు ఒక ప్రచారం అయితే గట్టిగా వినిపిస్తోంది. ఏపీ తెలంగాణా సీఎంలు కలుస్తారు అని ఇటీవల కూడా వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి మొక్కులు చెల్లించుకునేందుకు విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారి ఆలయానికి వస్తారని ఈ సందర్భంగా ఇద్దరూ భేటీ అవుతారు అని అనుకున్నారు.

కానీ ఇపుడు ఏకంగా దేశం కానీ దేశం పరాయి దేశం స్విట్జర్లాండ్ లో మీట్ అవుతారు అని పుకార్లు అయితే షికార్లు చేస్తున్నారు. ఇది రాజకీయంగా మాత్రం ప్రకంపనలు సృష్టించే అంశంగా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ అరుదైన కలయిక ఉంటుందా లేదా అన్నది మరో ఇరవై రోజులలో తెలిసిపోతుంది అని అంటున్నారు.