మోడీ చేస్తే.. ఒప్పు-మేం చేస్తే తప్పా: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశం తోనే మూసీని ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. కానీ, ఇది బీజేపీ నాయకులకు ఇబ్బందిగా మారిందన్నారు.
By: Tupaki Desk | 8 May 2025 7:30 PMబీజేపీ నేతల వైఖరిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నది ప్రక్షాళన చేయాలని తాము సంకల్పిస్తే.. దానిని తప్పుపడుతున్నవారికి.. యమున, గంగా నదులను ప్రక్షాళన చేసేం దుకు మోడీ, యోగి(యూపీ సీఎం) ప్రయత్నాలు తప్పుగా కనిపించలేదా? అవి తప్పులు కానప్పుడు.. ఇవి తప్పులెలా అవుతాయి? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. హైదరాబాద్ ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశం తోనే మూసీని ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. కానీ, ఇది బీజేపీ నాయకులకు ఇబ్బందిగా మారిందన్నారు.
అదే.. బీజేపీ నాయకులు నదుల ప్రక్షాళన పేరుతో ఆక్రమణలు తొలగిస్తే.. మాత్రం బాగానే ఉంటుందా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అదే తెలంగాణ ప్రజల కోసం ఓ గొప్ప కార్యక్రమం చేపడితే దానిని ఓర్చుకోలేక పోతున్నారని దుయ్యబట్టారు. మూసీలో ఆక్రమణలు తొలగిస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందని ప్రచారం చేస్తున్నారని, కానీ.. వాస్తవానికి ఇది ఎలా సాధ్యమో ప్రచారం చేసేవారే చెప్పాలన్నారు. కంచ గచ్చి భూములను అభివృద్ధి చేయాలని అనుకుంటే దానిని కూడా అడ్డుకున్నారని విమర్శించారు.
ప్రస్తుతం దేశంలోని పలు మెట్రో నగరాల్లో ప్రజలు జీవించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్న సీఎం.. హైదరాబాద్‌లో అలాంటి దుస్థితి రాకుండా చూస్తున్నామని తెలిపారు. అందుకే.. హైడ్రాను ఏర్పాటు చేసి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా బెంగళూరు, ముంబై, చెన్నై మెట్రో సిటీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులను రేవంత్ రెడ్డి వివరించారు.
అదేవిధంగా ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయిన వైనాన్ని కూడా పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి హైద రాబాద్‌లో ప్రజలకు ఉండకూడదనే మూసీ ప్రక్షాళన సహా.. అక్రమ ఆక్రమణలను తొలగిస్తున్నా మన్నా రు. సికింద్రాబాద్ బుద్ధభవన్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రా రంభించారు. ఈ సందర్భంగా హైడ్రాను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.